NTV Telugu Site icon

Vijayawada: విజయవాడలో కలుషిత నీరు.. మున్సిపల్ వాటర్ త్రాగవద్దని దండోరా.. !

Vijayawada

Vijayawada

ఏపీలో కలుషిత నీరు ప్రజల ఉసురు తీస్తుంది. మురికి కాల్వల్లో వేసిన పైప్‌లైన్లు.. లీకేజీ కావడంతో తాగు నీరు కలుషితమైతుంది. ఈ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. విజయవాడలో ఈ కలుషిత నీరు తాగడంతో నలుగురు మరణించగా.. వందలాది మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

Read Also: Noida Fire Accident : నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చాలా ఫ్లాట్లు

అయితే, విజయవాడలో కలుషిత నీరు అధికారులకు బిగ్ టాస్క్ గా మారింది. కొండ ప్రాంతాలలోని ప్రజలు మున్సిపల్ వాటర్ త్రాగవద్దని దండోరా వేయిస్తున్నారు. సింగ్ నగర్, పాయకాపురం, భవానీపురం, సితారా సెంటర్, ఇంకా పలు ప్రాంతాలలో కలుషిత నీటి బాధితులు ఆరుగురు.. కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేరారు. బాధితులలో ముప్పై ఏళ్ళ వయసులోపు వారే అధికంగా ఉన్నారు. ఇక, బాధితుల్లో 17 ఏళ్ళ బాలుడితో పాటు 6 నెలల బాబుకు కలుషిత నీటి ఎఫెక్ట్ కు గురయ్యారు. వీరిని విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెరుగుతున్న కలుషిత నీటి బారిన రెండు రోజుల్లో 78 మంది బాధితులు ఉన్నట్లు అధికారుల లెక్కల్లో వెల్లడించారు.