Site icon NTV Telugu

West Bengal: రాత్రికి రాత్రే కోటీశ్వరులైన కూలీ.. ఒకటి కాదు రెండు కాదు 100కోట్లు

100 Crore Credited In Daily Wage Labourer Account At Bengal

100 Crore Credited In Daily Wage Labourer Account At Bengal

West Bengal: కొందరు నక్క తోక తొక్కి ఉంటారు. ఏం చేయకపోయిన అదృష్టం తన్నుకుంటూ వస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్‎కు చెందిన ఓ కూలీ ఓవర్ నైట్ కోటీశ్వరుడైపోయాడు. ఒకరి రెండు కోట్లతో కోటీశ్వరుడు కాదు ఏకంగా.. 100 కోట్లతో. అతని ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్లు జమ అయ్యాయి. విచిత్రం ఏంటంటే అతనికి ఆ డబ్బులు జమ అయినట్లు కూడా తెలియదు. ఆ కూలీ ఇంటికి సైబర్ క్రైం పోలీసుల నుంచి నోటీసులు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నీ అకౌంట్‌లో రూ. 100 కోట్లు జమ అయ్యాయి.. అందుకు సంబంధించిన పత్రాలను ఈనెల 30లోగా తీసుకురావాలని నోటీసుల్లో సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.

Read Also:Kollywood: కాస్త ఆగండి సర్… అందరికీ కావాలంటే అవ్వదిక్కడ

దీంతో కంగుతిన్న సదరు కూలీ.. అకౌంట్‌లో నగదును చెక్ చేసుకున్నాడు. నిజంగానే అతని అకౌంట్ లో 100 కోట్లు కనిపించడంతో అతనికి దిమ్మతిరిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేగంగాలోని వాసుదేవ్‌పూర్‌లో మహ్మద్ నసీరుల్లా అనే వ్యక్తికి ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులో ఈ డబ్బు జమ అయింది. అతడు ఓ వ్యవసాయ కూలీ. తల్లిదండ్రులతో పాటు భార్య, పిల్లలు అందరూ అతని సంపాదనపైనే ఆధారపడి ఉన్నారు. రోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కసారిగా అతని అకౌంట్‌లో 100 కోట్లు జమ కావడంతో పోలీసులు షాక్ తిని విచారణ ప్రారంభించారు. దీంతో మహ్మద్ నసీరుల్లా భయపడ్డాడు. ఈ నగదు జమకాక ముందు అతని అకౌంట్ లో కేవలం 17రూపాయలు మాత్రమే ఉన్నాయి. సైబర్ క్రైం పోలీసులు నోటీసులతో పాటు స్థానిక పోలీసుల నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతడి భయం రెట్టింపైంది.

Read Also:Atrocious : 13ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చెల్లి చూసింది.. ఆ తర్వాత

తన అకౌంట్ లో జమయిన నగదు గురించి ఆరా తీసేందుకు బ్యాంకు వద్దకు వెళ్లాడు. అసలు విషయం తెలుసుకొనే ప్రయత్నం చేశాడు. బ్యాంకు లావాదేవీల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదవశాత్తూ తన అకౌంట్‌లో వందకోట్లు జమ అయ్యి ఉంటాయని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అయితే, మహ్మద్ నసీరుల్లా అకౌంట్‌‌లో 100 కోట్లు జమ కావడంతో బ్యాంకు సిబ్బంది ఆ డబ్బులు ఎలా వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై స్థానిక మీడియా బ్యాంకు అధికారులను సంప్రదించగా.. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసుల విచారణ జరుగుతుందని, అప్పటి వరకు వివరాలు చెప్పలేమని తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని బ్యాంకు సిబ్బంది వెల్లడించారు.

Exit mobile version