Crime News: ట్యూషన్ కోసమని ఇంటి నుంచి బయలుదేరిన పదేళ్ల బాలిక ఓ భవనంలోని నీటి సంపులో విగతజీవిగా కనిపించింది. ఈ అనుమానాస్పద ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని మలవల్లి పట్టణంలో చోటుచేసుకుంది. మలవల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద నీటి సంపులో 10 ఏళ్ల బాలిక మృతదేహం కనిపించగా.. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన పదేళ్ల బాలిక మంగళవారం సాయంత్రం ట్యూషన్ తరగతులకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. కానీ ఆమె ట్యూషన్‌కు వెళ్లకపోవడం గమనార్హం.
Big Sale: బ్రాండెడ్ వాచ్‌కు ఆర్డర్ పెడితే.. గ్రాండ్‌గా పేడపెట్టి పంపించారు
మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన అనంతరం బాలిక తల్లితండ్రులు ఆ పాపను చూసిన బోరున విలపించారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్యూషన్ టీచర్ అయిన 45 ఏళ్ల రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించామని, పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని మాండ్యా ఎస్పీ పి.వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోందన్నారు.