NTV Telugu Site icon

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి!

Road Accident

Road Accident

Road Accident in UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌ జిల్లాలో వ్యానును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 27 మందికి గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అదనుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Also Read: Pat Cummins-Olympics: నాకు ఒలింపిక్స్‌లో ఆడాలనుంది: కమిన్స్‌

ఆదివారం బుదౌన్-మీరట్ రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సేలంపూర్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న బస్సును వ్యాన్ ఢీకొట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై స్పందించారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Show comments