Site icon NTV Telugu

Bus Accident: లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి, 20 మందికి గాయాలు

Bus Accident

Bus Accident

Bus Accident: ఝజ్జర్ కోట్లి సమీపంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్‌ నుంచి కత్రా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 75 మంది ప్రయాణికులతో బస్సు అమృత్‌సర్‌ నుంచి కత్రాకు వెళ్తోంది.

సోమవారం రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీ లోయలో పడిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మంది మృతి చెందగా, మరో 26 మంది గాయపడ్డారు. సాయంత్రం మానస మాతా ఆలయంలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో బాధితులు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది ఆలయానికి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో జరిగింది.

Read Also: Viral news : ఓరి నాయనో..కొంచెం కూడా సిగ్గులేదేంట్రా బాబు.. బైకుపైనే పాడుపని.. ఛీ..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ ట్రాక్టర్ ట్రాలీపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది, ఫలితంగా స్తంభాన్ని ఢీకొట్టింది. తరువాత లోయలో పడిపోయింది. . రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గూడా వెంటనే ఉదయపూర్వతిలోని సీహెచ్‌సీకి వచ్చి అధికారులు, స్థానికుల నుంచి సంఘటన గురించి ఆరా తీశారు.

Exit mobile version