Site icon NTV Telugu

Gold Smuggling : తమిళనాడులో రూ.10కోట్లు విలువగల బంగారం పట్టివేత

Gold

Gold

Gold Smuggling : తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 17.74కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.10.1కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక నుండి సముద్ర మార్గం గుండా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారం తో రామంతపూరం లో మాటు వేసిన DRI బృందం స్మగ్లర్లను పట్టుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డుల తో పాటు DRI అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నాటు పడవలో బంగారాన్ని ముఠా సభ్యులు తరలించే యత్నం చేశారు. స్లగ్లర్స్ కదలికలను పసిగట్టి బంగారాన్ని రెడ్ హాండెడ్గా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు DRI అధికారులు. శ్రీలంక నుండి బంగారాన్ని ఎవరు పంపారు? చెన్నై లో ఎవరు తీసుకోబోతున్నారు అనే సమాచారాన్ని స్వేకరిస్తున్నారు డీఆర్ఐ అధికారులు.

Read Also: Phone Addict: ఫోన్ చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్న హైదరాబాదీ మహిళ

బంగారం పట్టివేత ఘటనలు ఈ మధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. రెండు వారాల క్రితం విదేశాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి రూ.3 కోట్ల విలువ చేసే ఐదున్నర కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి లో దుస్తుల్లో దాచి అక్రమ రవాణాకు పాల్పడ్డారు. వీరిపై అనుమానంతో విమానాశ్రయ అధికారులు ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశారు.

Exit mobile version