Vote: వచ్చే నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్నీ ప్రచారాలు ఊదరగొడుతున్నాయి. తమకు ఓట్లేస్తే ఇలా చేస్తాం.. అలా చేస్తామంటూ అమలు సాధ్యం అవుతాయా.. లేదా అన్నది ఆలోచించకుండా హామీలు గుప్పిస్తున్నాయి. ఎలాగైనా మెజార్టీ సాధించి పీఠాన్ని దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం దాదాపు 10.42 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 10 కల్లా ఓటరు జాబితాను తయారు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ చేసి అక్టోబర్ 4న జాబితాను ప్రచురించింది. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఓటు హక్కు కోసం 10.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
Read Also:Rahul Gandhi: అంబటి పల్లిలో మహిళా సదస్సు.. పొల్గొన్న రాహుల్ గాంధీ
కొత్తగా ఓటు హక్కు పొందిన వారందరికీ ఎన్నికల సంఘం ఉచితంగా ఓటరు కార్డును అందించనుంది. అర్హులైన ఓటర్లకు పోస్టు ద్వారా ఓటరు కార్డును పంపించనుంది. దీంతోపాటు ఆన్ లైన్లో ఓటరు కార్డు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఓటరు కార్డును డిజి లాకర్‌లోనూ భద్రపర్చుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. ప్రింట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఓటరు కార్డు డౌన్‌లోడ్ చేసుకునే సందర్భంలో ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఓటరు జాబితాలోని పోలింగ్ స్టేషన్, సీరియల్ నంబర్, పోలింగ్ తేదీ వాటితో క్యూఆర్ కోడ్‌ను ముద్రించి ఇవ్వనున్నారు. ఓటర్ కార్డును https://voterportal.eci.gov. in/login లేదా https://nvsp.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read Also:Lic Super Plan :సూపర్ ప్లాన్..రూ.87 రూపాయలతోరూ.11 లక్షలు రాబడి.. ఎలాగంటే?