NTV Telugu Site icon

Cyber ​​Fraud: సైబర్‌ మాయాజాలం.. ఉద్యోగం పేరుతో రూ.1 లక్ష 75 వేలు స్వాహా..

Cyber Crime

Cyber Crime

Cyber ​​Fraud: సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులు నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు.‌ తాజాగా సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం పోలారంకు చెందిన ఓ యువతి నిరుద్యోగి, అయితే ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. దీనిని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్ కు మెసేజ్ పంపించారు. నిరుద్యోగిగా వున్న యువతి ఉద్యోగం వస్తుందని ఆశ పడింది. వెనకాముందు ఆలోచించకుండా మెసేజ్ కు రిప్లై వచ్చింది. దీనిని సైబర్ కేటుగాళ్లు ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పిస్తానంటే నిజమని నమ్మిన యువతి పలు దఫాలుగా డబ్బులు పంపించింది. అది కాస్తా రూ. 1 లక్షా 75 వేల రూపాయలు ట్రాన్సఫర్ చేసుకున్నాడు. ఇక ఆ యువతికి ఉద్యోగంలో చేరడమే ఆలస్యం అనుకుంది. ఇంతలోనే సైబర్ కేటుగాడు ఆ యువతికి గట్టి షాక్ ఇచ్చాడు. ఫోన్ స్విచ్ ఆఫ్, నో రెస్పాన్స్‌ దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం పేరుతో తన దగ్గర రూ.1 లక్షా 75 వేల రూపాయలు మోసపోయానని వాపోయింది. ఉద్యోగము రాక, ఇటు డబ్బులు పోయి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏఎన్ఎం ఉద్యోగం అంటే ఆశ పడ్డానని తెలిపింది. తన డబ్బులు వాపసు ఇప్పించాలని కోరింది. తనకు వచ్చిన నెంబర్‌, డబ్బులు ట్రాన్ ఫర్ చేసిన ఫోన్‌ నంబర్‌ లను పోలీసుల‌కు ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ కు రెన్పాన్స్‌ కావద్దని, యువతను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల ఉచిత బీమా

Show comments