Site icon NTV Telugu

Tata EV Discounts 2025: ఆఫర్ అదిరింది.. టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. 1.86 లక్షల డిస్కౌంట్

Tata

Tata

ఈ మధ్య కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై మే 2025లో బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో టాటా కర్వ్ EV, పంచ్ EV, నెక్సాన్ EV, టియాగో EV ఉన్నాయి. టాటా మోటార్స్ EV శ్రేణిపై రూ.1.86 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా టాటా మోటార్స్ రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అలాగే ఇన్‌స్టాలేషన్‌తో ఉచిత హోమ్ ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. కస్టమర్లు 6 నెలల ఉచిత ఛార్జింగ్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్‌లో జీరో డౌన్ పేమెంట్, 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్సింగ్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ నుంచి వచ్చే అన్ని ఎలక్ట్రిక్ కార్లు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తాయి.

Also Read:HYD : రాంగ్ రూట్ కష్టాలు.. బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు..

టాటా కర్వ్ EV

టాటా కర్వ్ EV రూ. 1.71 లక్షల వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఇది సెప్టెంబర్ 2024లో ప్రారంభించబడింది. ఇది టాటా మోటార్స్ నుంచి వచ్చిన సరికొత్త EV కారు. భారత మార్కెట్లో, టాటా కర్వ్ EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 22.24 లక్షల వరకు ఉంది.

టాటా నెక్సాన్ EV

టాటా నెక్సాన్ EV రూ. 1.41 లక్షల వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఇది భారత మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. భారత్ లో టాటా నెక్సాన్ EV ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.19 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది.

Also Read:Anand Deverakonda : 90’s దర్శకుడితో ‘బేబీ’ కాంబో.. క్లాప్ కొట్టిన నేషనల్ క్రష్

టాటా పంచ్ ఈవీ

టాటా పంచ్ EV పై రూ. 1.20 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇది టాటా బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. టాటా పంచ్ EV భారత్ లో రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తోంది.

Also Read:VC Sajjanar : సోషల్ మీడియా పిచ్చికి హద్దులుండాలి.. ఆర్టీసీ సిబ్బందిని ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు

టాటా టియాగో ఈవీ

టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.1.30 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. భారత మార్కెట్లో టాటా టియాగో EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు ఉంది.

Exit mobile version