Site icon NTV Telugu

ప్ర‌పంచంలోనే తొలి డిఎన్ఏ వ్యాక్సిన్‌…త్వ‌ర‌లో అందుబాటులోకి…

దేశంలో ఇప్ప‌టికే వ్యాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని వేగంగా అమ‌లు చేస్తున్నారు.  సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్‌, భార‌త్ బ‌యోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  ర‌ష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వ‌చ్చింది.  అయితే, గుజ‌రాత్‌లోని జైడ‌స్ క్యాడిలా ఫార్మా నుంచి మ‌రో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది.  డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ఇది.  క‌రోనాకు డిఎన్ఏ బేస్ మీద త‌యారు చేసిన తొలి వ్యాక్సిన్ జైకోవ్ డీ కావ‌డం విషేషం.

Read: రివ్యూ: కోల్డ్ కేస్

అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది.  28 వేల మందిపై ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హించారు.  12-18 ఏళ్ల మంది పిల్ల‌ల‌పై కూడా ఈ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హించారు. త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తుంద‌ని నిపుణులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. అత్య‌వ‌స‌ర అనుమ‌తులు ల‌భించిన త‌రువాత సంవ‌త్స‌రానికి 12 కోట్ల డోసుల‌ను త‌యారు చేస్తామ‌ని చెబుతున్నారు.  కోవీషీల్డ్, కోవాగ్జిన్‌లు రెండు డోసుల వ్యాక్సిన్ కాగా, జైకోవ్‌డీ మాత్రం మూడు డోసుల వ్యాక్సిన్ కావ‌డం విషేషం. 

Exit mobile version