Youtuber vs Singer Over Armaan Malik Name: ఒకే పేరున్న వ్యక్తులు కోట్లలో ఉండొచ్చు. పేరు విషయంలో పేటెంట్ హక్కులనేవి ఉండవు. కాబట్టి.. ‘నా పేరు ఎందుకు పెట్టుకున్నావు?’ ఎవ్వరినీ నిలదీయలేము. ఈ విషయం తెలియని సింగర్ అర్మాన్ మాలిక్.. అనవసరమైన వివాదానికి తెరలేపాడు. ఒక యూట్యూబర్ పేరు, తన పేరు ఒకటే కావడంతో.. అతనికి సంబంధించి వస్తున్న వార్తల్ని తనకు ఆపాదించుకొని, ఓ సంచలన ట్వీట్ చేశాడు. దీంతో.. ఆ ఇరు వర్గాల మధ్య ఇప్పుడు మాటలయుద్ధం జరుగుతోంది. ఈ గొడవలో సింగర్ అర్మాన్‌పైనే ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
Delhi Crime News: కుక్కపై అత్యాచారం.. కెమెరాకి చిక్కిన నిందితుడు
సందీప్ అనే ఓ వ్యక్తి ‘అర్మాన్ మాలిక్’ పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. నిజానికి.. అర్మాన్ మాలిక్ అనేది అతని రెండో పేరు. కాబట్టి, ఆ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. వాళ్లిద్దరు ఇప్పుడు గర్భవతులు. తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్యలతో కలిసి అర్మాన్ మాలిక్ వీడియోలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా తన భార్యలతో కలిసి ఒక ప్రాంక్ వీడియో చేశాడు. అందులో అతడు మొదట తన ఇద్దరి భార్యలపై చెయ్యి చేసుకుంటాడు. ఆ తర్వాత చివర్లో ‘ఇదంతా ప్రాంక్’ అని ట్విస్ట్ ఇస్తాడు. ఈ వీడియోపై కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. మీడియా గురించి తెలిసిందేగా.. ప్రేక్షకుల అటెన్షన్ పొందేందుకు కాస్త మసాలాని జోడిస్తాయి. సో.. ఇక్కడ ఆ వీడియో విషయంలోనూ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలపై చెయ్యి చేసుకున్నాడనే టైటిల్‌తో కథనాలు రాసుకొచ్చాయి.
Road Accident: కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
ఈ వార్తలు తన కంటికి కనిపించడంతో.. సింగర్ అర్మాన్ మాలిక్ కాస్త ఘాటుగా ట్వీట్ చేశాడు. ‘‘మీడియాలో ఆ వ్యక్తిని అర్మాన్ మాలిక్ అని పిలవడం ఆపండి, అతని అసలు పేరు సందీప్. నా పేరుని తప్పుగా వాడుకుంటున్నారు. ఉదయాన్నే లేవగానే అలాంటి ఆర్టికల్స్, వార్తలు చదువుతుంటే.. చాలా అసహ్యంగా ఉంది’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఆ యూట్యూబర్ కూడా అంతే గట్టిగా బదులిచ్చాడు. అర్మాన్ మాలిక్ పేరుతో నువ్వొక్కడివే ఈ ప్రపంచంలో ఉన్నావా? పేర్లపై పేటెంట్ హక్కులేమైనా ఉన్నాయా? అని నిలదీశాడు. తానను బ్లాగ్స్, టిక్ టాక్స్ చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని.. నీ ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి నువ్వు సింగర్ అయ్యావని.. లేకపోతే అయ్యేవాడివే కాదంటూ కౌంటర్ ఇచ్చాడు.
