Site icon NTV Telugu

Push-Ups on Railway Bridge: పైత్యం ముదిరిందా.. బ్రిడ్జిని పట్టుకుని కిందికి వేలాడిన యువకుడు..

Untitled Design (2)

Untitled Design (2)

కొందరు యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. లైక్స్, షేర్ల కోసం రీల్స్ చేస్తూ ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

తాజాగా ఓ యువకుడు ఢిల్లీ–లక్నో జాతీయ రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్‌పై వేలాడుతూ పుష్‌అప్స్ చేయడం కలకలం రేపింది. కింద వాహనాలు వేగంగా వెళ్తుండగానే, పైన రైల్వే బ్రిడ్జ్‌పై వేలాడుతూ అత్యంత ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. ఈ ఘటనను గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు సహాయక బృందాలు యువకుడిని సురక్షితంగా కాపాడి, ట్రాఫిక్‌ను నియంత్రించారు.

యువకుడు పుష్‌అప్స్ చేస్తుండగా అతడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం ద్వారా ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బహిరంగంగా శిక్షించాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తమ జీవితాలతో చెలగాటం ఆడవద్దని సూచిస్తున్నారు.

Exit mobile version