NTV Telugu Site icon

Sonia Gandhi: ‘‘ మీ ప్రతీ ఓటు..’’ ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సందేశం..

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి వీడియో సందేశంలో ప్రసంగించారు. మే 25న ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో వీడియో సందేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ మీ ప్రతీ ఓటు ఉపాధిని సృష్టిస్తుంది. ద్రవ్యోల్భణాన్ని తగ్గిస్తుంది. మహిళలకు సాధికారతను కల్పిస్తుంది’’ అని ఆమె చెప్పారు. ఇది అత్యంత కీలమైన ఎన్నికలని, ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలని ఆమె అన్నారు.

READ ALSO: Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు.. చెట్ల కిందే డ్రగ్స్?

ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని ఆమె కోరారు. ‘‘ ఈ ఎన్నికలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు రాజ్యాంగ సంస్థలపై దాడులు వంటి సమస్యలపై పోరాడుతున్నాయి, ఈ పోరాటంలో మీరు మీ వంతు పాత్ర పోషించాలి. మీ ఓటు సమానత్వంతో కూడిన భారతదేశాన్ని సృష్టిస్తుంది’’ అని ఆమె అన్నారు. ఇండియా కూటమికి ఓటేయాలని ప్రజల్ని ఆమె కోరారు. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి అభ్యర్థుల్ని భారీ ఓట్లతో గెలిపించాలని ఓటర్లకు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో ఏడు నియోజకవర్గాల్లో గత రెండు సార్లు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ మరియు నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని నిలబెట్టగా, మిగిలిన 4 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తోంది.