Site icon NTV Telugu

Bihar Video: నడిరోడ్డుపై ఆకతాయి స్టంట్లు.. హడలెత్తిపోయిన విద్యార్థినులు

Bihar Video2

Bihar Video2

అమ్మాయిలను చూడగానే బుర్రలో పురుగు పుట్టిందో.. లేదంటే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. ఒక యువకుడు నడిరోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేసి స్కూల్ విద్యార్థినులు భయకంపితులు చేశాడు. ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Maharashtra: బీజేపీ-శివసేన మధ్య విభేదాలు! కూటమి నిలబడేనా?

పాఠశాల విద్యార్థినులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలోనే ఒక యువకుడు వారి ముందు సడన్‌గా పైకి ఎగిరి స్టంట్ చేశాడు. ఈ సన్నివేశాన్ని చూసిన అమ్మాయిలు ఒక్కసారిగా భయాందోళనకు గురై పక్కకు తప్పుకున్నారు. అసలేం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బీహార్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను భయపెట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Off The Record: కవితకు బీఆర్ఎస్ కౌంటర్స్.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..?

అయితే వీడియోపై నలంద జిల్లా పోలీసులు స్పందించారు. యువకుడు ఉద్దేశపూర్వకంగానే ఈ స్టంట్ చేశాడని గుర్తించారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. తక్షణమే యువకుడిని ప్రసిద్ధ జూలోని ఒక బోనులోకి పంపించాలని కోరారు. అక్కడైతే ఎవరికి హానీ చేయకుండా విన్యాసాలు చేసుకోవచ్చని.. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని రాసుకొచ్చాడు. ఇది తీవ్రమైన ప్రవర్తన అని.. యువతులను భయపెట్టేందుకు ఇలా చేశాడని తక్షణమే అరెస్ట్ చేయాలని మరో నెటిజన్ డిమాండ్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

 

Exit mobile version