మహారాష్ట్రలో మహా ఘోరం జరిగిపోయింది. డాక్టర్ కావాల్సిన ఓ విద్యాకుసుమం అర్థాంతరంగా రాలిపోయింది. ఎంబీబీఎస్ అడ్మిషన్ రోజే ఈలోకం నుంచి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Delhi Baba Horror: స్వామి చైతన్యానందపై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు.. పోలీసుల దర్యాప్తు
అనురాగ్ అనిల్ బోర్కర్ (19) మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన వాసి. నీట్ యూజీ 2025 పరీక్షలో 99.99 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. ఓబీసీ విభాగంలో 1475 ఆలిండియా ర్యాంక్ సాధించాడు. ఇంకేముంది అడ్మిషన్ తీసుకుని స్టెతస్కోప్ పట్టుకోవాల్సిన చేతులతో ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు చేదు అనుభవం.. ట్రంప్ కాన్వాయ్ కారణంగా రోడ్డుపై నిలిపివేత
ప్రస్తుతం అనురాగ్ అనిల్ సందేవాహి తాలూకాలోని నవర్గావ్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎంబీబీఎస్ కోర్సులో చేరేందుకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో ఇంట్లో అనురాగ్ అనిల్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అనురాగ్ అనిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ వివరాలు బయటకు వెల్లడించకపోయినా… ఆఫ్ ది రికార్డ్ ప్రకారం.. తనకు డాక్టర్ కావాలని లేదని.. అలా కోరుకోవడం లేదని రాసినట్లుగా పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కేసును నవర్గావ్ పోలీసుల దర్యాప్తులో ఉంది.
