NTV Telugu Site icon

Rajya Sabha: రాజ్యసభ చైర్మన్‌పై ‘‘అభిశంసన తీర్మానాని’’కి విపక్షాల ప్లాన్.. ధంఖర్-జయా బచ్చన్ గొడవే కారణం..

Jagdeep Dhankhar Jaya Bachchan Clash

Jagdeep Dhankhar Jaya Bachchan Clash

Rajya Sabha: పెద్దల సభలో చైర్మన్ జగదీప్ ధంఖర్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శుక్రవారం వీరిద్దరి మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దంఖర్ మాట్లాడే విధానం సరిగా లేదని, ఆయన స్వరం ఆమోదయోగ్యం కాదని జయా బచ్చన్ చెప్పడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన చైర్మన్ ధంఖర్..‘‘కానీ ప్రతి రోజు, నేను పునరావృతం చేయాలనుకోను, ప్రతి రోజు, నేను చదువు చెప్పాలని కోరుకోను’’ అని అన్నారు. ‘‘మీరు సెలబ్రెటీ కావచ్చు, కానీ సభ అలంకారాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆగ్రహించారు. దీంతో ఒక్కసారిగా సభలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘‘ జయాజీ మీరు గొప్ప పేరు సంపాదించారు. దర్శకుడు చెప్పిన దానికి మీరు లోబడి ఉంటారని మీకు తెలుసు. నేను సభాపతి స్థానం నుంచి చూసిన దానిని మీరు చూడలేరని ధంఖర్ అన్నారు.

Read Also: Waqf Bill: వక్ఫ్ బిల్లుపై ‘‘జేపీసీ’’ ఏర్పాటు.. డీకే అరుణ, ఓవైసీలకు చోటు..

అంతకుముందు జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘ సాన్ నేను జయ అమితాబ్ బచ్చన్ మాట్లాడాలనుకుంటున్నాను.. నేను నటిని, నాకు బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ అర్థం చేసుకోగలను. నన్ను క్షమించండి, కానీ మీ చెప్పే పద్ధతి ఆమోదయోగ్యంగా లేదు. మేం మీ సహ సభా సభ్యులం. మీరు సభాపతి అయి ఉండొచ్చు కానీ నేను స్కూల్‌కి వెళ్లడం నాకు గుర్తింది, మేం స్కూల్ పిల్లలం కాదు’’ అంటూ వ్యాఖ్యానించారు.” జయాజీ, టేక్ యువర్ సీటు… టేక్ యువర్ సీట్…” అని మిస్టర్ ధంఖర్ పదే పదే చెప్పారు.

రాజ్యసభలో గొడవ పెద్దది కావడంతో కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశారు. సోనియా గాంధీ నేతృత్వంలో జయా బచ్చన్‌కి మద్దతుగా వాకౌట్ చేశారు. సోనియాగాంధీ, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పార్లమెంట్ వెలుపల సమావేశమయ్యారు. ప్రతిపక్ష ఎంపీలను చైర్మన్ పదేపదే అవమానించారని జైరాం రమేష్ ఆరోపించారు. శివసేన(ఠాక్రే) ఎంపీ ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి కన్నా జయా బచ్చన్‌కి పార్లమెంటరీ అనుభవం చాలా ఉందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఇండియా కూటమి నేతలు చైర్మన్‌పై ‘‘అభిశంసన తీర్మానం’’ ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో చైర్మన్ ధంఖర్ వ్యవహార శైలి ఆమోదయోగ్యంగా లేదని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు.

Show comments