Site icon NTV Telugu

Yogi Adityanath: ప్రతీ క్రిమినల్, రేపిస్ట్ ఎస్పీలోనే పుడుతాడు.. సీఈఓ అఖిలేష్ యాదవ్..

Yogi

Yogi

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), దాని అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేష్ యాదవ్ చెప్పే ‘‘పీడీపీ’’కి కొత్త అర్థాన్ని యోగి చెప్పారు. పీడీపీ అంటే వెనకబడిని, దళిత, అల్పా సంఖ్యాకులు కాదని ‘‘ప్రొడక్షన్ హౌజ్ ఆఫ్ దంగై, అపరాధి’’( అల్లర్లు, అపరాధాలు చేసే వ్యక్తుల ప్రొడక్షన్ హౌజ్)అని యోగి అన్నారు.

Read Also: Phil Salt: టీ20ల్లో రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్.. ఒకే జట్టుపై..!

ఉత్తర్ ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలోని కతేహరి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎస్పీ ఎమ్మెల్యే లాల్జీ వర్మ ఎంపీ ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. “ప్రతి క్రిమినల్, మాఫియా, రేపిస్ట్ ఈ ప్రొడక్షన్ హౌస్‌లో పుడతాడు.అఖిలేష్ యాదవ్ దాని CEO” అని అన్నారు. అయోధ్య మరియు కన్నౌజ్‌లలో అత్యాచారం కేసులలో సమాజ్‌వాదీ పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ నాయకుల్ని చూస్తే ఆడపిల్లలు భయపడుతున్నారని అన్నారు.

‘‘ గుర్తుంచుకోండి. ఈ ప్రాంతం మాఫియా బాస్ ఖాన్ ముబారక్ ఎస్పీ శిష్యుడు కాదా..? ముఖ్తార్ అన్సారీ వారి శిష్యుడు, అతీక్ అహ్మద్ కూడా ఎస్పీకి చెందిన వాడే. వారు పెదల్ని దోచుకున్నాడు. బలహీనుల భూమిని స్వాధీనం చేసుకున్నారు. సమాజిక సామరస్యానికి విఘాతం కలిగించారు. రాష్ట్రం, కేంద్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ వారి శకాన్ని ముగించింది’’ అని యోగి అన్నారు.

Exit mobile version