Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం నడుస్తోంది. నిన్న బరేలీలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత, పెద్ద ఎత్తున గుంపు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థిని కంట్రోల్ చేశారు. ఈ వివాదం కాన్పూర్‌లో మొదలైంది. తర్వాత కౌశాంబి లాంటి పట్టణాలకు చేరింది. అన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగీ సర్కార్ ఈ అల్లర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే 40 మందిని అరెస్ట్ చేయగా, 200 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Read Also: IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ ముందు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు గాయం!
శనివారం జరిగిన ‘‘వికసిత్ యూపీ’’ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన హెచ్చరికలు జరా చేశారు. మొత్తం అల్లర్లకు కారణమైన మతగురువు తౌకీర్ రజా ఖాన్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐ లవ్ ముహమ్మద్ ప్రచారానికి మద్దతు ఇచ్చి, జనాలు గుమిగూడటానికి, ఉద్రిక్తతలకు కారణమైన ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మతగురువు తౌకీర్ రజా ఖాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లు కనిపించింది.
‘‘నిన్న, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో ఒక మౌలానా మర్చిపోయారు” అని ఆదిత్యనాథ్ ఏ పేర్లు చెప్పకుండా అన్నారు. అతను కోరుకున్నప్పుడల్లా వ్యవస్థల్ని ఆపగలనని అనుకుంటున్నాడు, కానీ మేము రోడ్ బ్లాక్ లేదా కర్ఫ్యూ ఉండదని స్పష్టంగా చెబుతున్నామని యోగి చెప్పారు. భవిష్యత్ తరాలు అల్లర్లు చేసే ముందు రెండుసార్లు ఆలోచించేలా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 2017 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూను అనుమతించడం లేదని యోగి చెప్పారు.
