ఈ నెల 21న (రేపు) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తన సందేశం ఇచ్చారు. ఆరోగ్యం.. శ్రేయస్సు కోసం ప్రజలు యోగాను తప్పకుండా ఆచరించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర జీవన శైలి వ్యాధులు నేటి తరంలో పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగాకు సంబంధించి వీడియోను షేర్ చేశారు.
జూన్ 21న (రేపు) మైసూరులో జరిగే యోగా దినోత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు. యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శ్వాస వ్యవస్థకు సంబంధించి వ్యాయామం కూడా అని ప్రధాని వివరించారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యోగాని సులభంగా చేసుకోవచ్చని తెలిపారు. దీన్ని చేయడానికి ఒక చాప, కొంచెం స్థలం ఉంటే చాలు. యోగాను ఇంట్లోనే చేసుకోవచ్చు. పనిలో.. విరామం సమయంలోనూ చేసుకోవచ్చని చెప్పారు ప్రధాని మోడీ. ఈ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేసి, యోగను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువద్దామని పిలుపు నిచ్చారు.
రేపు, జూన్ 21ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరపుకుంటున్నాం. ‘మానవత్వం కోసం యోగ’ అనే నేపథ్యంతో మార్గనిర్దేశం చేస్తూ, ఈ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేసి, యోగను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువ ద్దాం. https://t.co/UESTuNPNbW
— Narendra Modi (@narendramodi) June 20, 2022
