Site icon NTV Telugu

VijayaSaiReddy: నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న మహిళ ఎవరంటే..?

Rahul Gandhi Night Club

Rahul Gandhi Night Club

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి చెందిన ఓ నైట్ క్లబ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పక్కన ఓ మహిళ ఉండటంపై విమర్శల వర్షం కురుస్తోంది. బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా రాహుల్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి ఆమె రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. సొంతపార్టీలో రచ్చ నడుస్తుంటే ఆయన మాత్రం నైట్ క్లబ్‌లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వీడియోపై వివరణ ఇచ్చేందుకు కాంగ్రెస్ వర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర అంశం వెల్లడించారు. నేపాల్ నైట్‌ క్లబ్‌లో రాహుల్ గాంధీ పక్కన కనిపించిన మహిళ చైనా దౌత్య సిబ్బంది అని తెలిపారు. ఆమె చైనా రాయబారి హౌ యాంక్వీ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీకి సంబంధించిన వీడియో నేపథ్యంలో చైనా హనీట్రాప్ ఎత్తుగడలు మరోసారి తెరపైకి వచ్చాయని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో ప్రస్తావించారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ అనవసర వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ పార్టీ సొంత నేతే వివాదంలో చిక్కుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

COVID 19: కొత్త వేరియంట్‌ కలకలం.. భారత్‌లో తొలి కేసు నమోదు

Exit mobile version