Site icon NTV Telugu

Delhi Floods: యమునా నది ఉధృతం.. ఇళ్లల్లోకి వచ్చేసిన నీరు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత

Delhirain

Delhirain

దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన ప్రాంతాలన్నీ అతలాకుతలం అయ్యాయి. రహదారులన్నీ నదులు తలపిస్తున్నాయి. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇక గురుగ్రామ్‌లో అయితే 7 కి.మీ పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు నరకయాతన పడ్డారు.

ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. చెల్లిని ప్రేమించాడని ఓ అన్నయ్య ఘాతుకం.. ప్రియుడిని బయటకు తీసుకెళ్లి..!

ఇక భారీ వర్షాలు కారణంగా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిని దాటి ఉప్పొంగుతోంది. దీంతో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. సాయంత్రానికి యమునా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని.. తక్షణమే లోతట్టు ప్రాంత ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gurgaon: భారీ వర్షంతో గురుగ్రామ్ అతలాకుతలం.. 7 కి.మీ ట్రాఫిక్ జామ్.. వాహనదారులు బెంబేలు

యమునా నదితో పాటు మరికొన్ని నదుల నీటి మట్టాలు కూడా భారీ పెరిగాయి. దీంతో యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ వరద గేట్లను అధికారులు ఎత్తేశారు. దీంతో ముందు జాగ్రత్తగా మంగళవారం పాఠశాలలు మూసేయాలని అధికారులు ఆదేశించారు. ఇక సెప్టెంబర్ 5 వరకు ఫీల్డ్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. ఇక ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కోరారు. నది పర్యావరణ వ్యవస్థలో భాగంగానే యమునా నీరు మైదనంలోకి వస్తుందని చెప్పారు.

మంగళవారం తెల్లవారుజామున యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయి 205.33 మీటర్లు దాటింది. సాయంత్రం నాటికి నీటి మట్టం 206.50 మీటర్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు. సోమవారం కేవలం నాలుగు గంటల్లోనే గురుగ్రామ్‌లో 100 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. దీంతో హీరో హోండా చౌక్-ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వంటి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇక మంగళవారం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 4 వరకు ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ప్రతిరోజూ వర్షాలు ఉంటాయని చెప్పింది. ఇక వర్షాలు కారణంగా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేయాలని అధికారులు కోరారు.

Exit mobile version