Site icon NTV Telugu

Delhis Railway Station: రణరంగంగా ఢిల్లీ రైల్వేస్టేషన్.. డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్

Delhi Railway Station2

Delhi Railway Station2

దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్ కాస్తా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌కు వేదికలాగా మారిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్యాసింజర్స్ బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Rivaba Jadeja: ట్రెండింగ్‌గా రివాబా జడేజా.. కారణమిదే!

ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. అలాంటి రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫామ్‌పై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం సిబ్బంది వాగ్వాదానికి దిగారు. అంతలోనే తీవ్ర కొట్లాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు చెత్తబుట్టలు విసురుకోవడం, బెల్టులుతో కొట్టుకోవడం, తన్నుకోవడం, పిడిగుద్దుల వర్షంతో భీతావాహం సృష్టించారు. దీంతో ప్రయాణికులంతా హడలెత్తిపోయారు.  డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌‌ను గుర్తుచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేడు ఎంత తగ్గిందంటే..!

ఐఆర్‌సీటీసీ సిబ్బంది సృష్టించిన బీభత్సానికి ప్రయాణికులంతా చెల్లాచెదురుగా చెదిరిపోయారు. లగేజీ తీసుకుని పారిపోయారు. కొందరైతే తమ మొబైల్స్‌లో వీడియోలు తీస్తూ కనిపించారు. మరికొందరు గొడవను చూస్తూ ఉండిపోయారు. ఇంతలోనే రైల్వే పోలీసులు వచ్చి చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ప్లాట్‌ఫామ్‌పై భారతీయ రైల్వే సెమీ హై స్పీడ్ రైలు.. వందే భారత్ ఆగి ఉంది.

 

Exit mobile version