Site icon NTV Telugu

Wrestlers Protest : న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న రెజ్లర్లు

Wrestlers Protest

Wrestlers Protest

Wrestlers Protest : రెజ్లర్లు తమ పోరాట రూపాన్ని మార్చుకున్నారు. ఇకపై రోడ్లపై పోరాటం చేయకుండా.. న్యాయస్థానాల నుంచి పోరాడాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై తాము చేస్తున్న పోరాటాన్ని ఇకపై న్యాయస్థానంలోనే కొనసాగిస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించారు. తమపై బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనిపై చర్య తీసుకోవాలంటూ ఐదు నెలలుగా చేస్తున్న ప్రత్యక్ష పోరాటానికి స్వస్తి పలుకుతున్నట్టు ఆదివారం తెలిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై పోలీసులు ఈ నెలలో కేసు దాఖలు చేసినందున తాము ఇన్నాళ్లూ నిర్వహించిన ‘మీ టూ’ ఆందోళన విరమిస్తున్నట్టు తెలిపారు.

Read also: TS Schools: నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్..! ABVP పిలుపు..?

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై తమ పోరాటం ఇప్పుడు న్యాయస్థానాల్లో జరుగుతుందని రెజ్లర్లు ప్రకటించారు.
రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ మరియు బజరంగ్ పునియా ఒకేలాంటి ట్వీట్లలో, బిజెపి నాయకుడిపై ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇకపై పోరాటం రోడ్ల మీద కాకుండా కోర్టు ద్వారా ఉంటుందని ప్రకటించారు. WFIలో సంస్కరణకు సంబంధించి కేంద్ర మంత్రి వాగ్దానం చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని జూలై 11న ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం తాము వేచి ఉంటామన్నారు.

Read also: Blast in Kuppam: కుప్పంలో భారీ పేలుడు

దాదాపు 40 నిమిషాల మాట్లాడిన రెజ్లర్లు సింగ్‌పై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. బిజెపి నాయకుడిపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను మూల్యాంకనం చేసిన తర్వాత ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించాలో చర్చిస్తామన్నారు. బ్రిజ్ భూషణ్‌ను కటకటాల వెనక్కి నెట్టే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఛార్జ్ షీట్ కాపీ కోసం ఎదురుచూస్తున్నామని.. అది బలంగా ఉందో లేదో తాము పరిశీలిస్తామన్నారు. రోడ్డుపై పోరాడాలా లేకపోతే ప్రాణాలను పణంగా పెట్టాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తమ పోరాటం ముగియలేదని ఫోగట్ స్పష్టం చేశారు. తన స్వప్రయోజనాల కారణంగానే దత్ తమను టార్గెట్ చేస్తున్నాడని వినేష్ ఆరోపించాడు. బ్రిజ్ భూషణ్ తనకు డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ పదవిని ఆఫర్ చేసి ఉండవచ్చని అందుకే అతను ఆయన వైపు నిలిచారని ఆమె అన్నారు. మే 28న జంతర్ మంతర్ నుండి రెజ్లర్లను తొలగించిన తర్వాత … సింగ్‌పై ఛార్జిషీట్ దాఖలు చేస్తామని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో వారు జూన్ 15 వరకు తమ నిరసనను నిలిపివేసిన సంగతి తెలిసిందే. బ్రిజ్‌ అతని కుటుంబ సభ్యులు ఎవరూ డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించబోమని కూడా హామీ ఇచ్చారు.

Exit mobile version