Site icon NTV Telugu

World’s First Bamboo Crash Barrier: వెదురుతో రోడ్డు క్రాష్ బారియర్.. బాహుబలి అంటూ ట్వీట్ చేసిన గడ్కరీ..

Bamboo Crash Barrier

Bamboo Crash Barrier

World’s First Bamboo Crash Barrier : సాధారణంగా రోడ్ల వెంట ఉక్కు బారియర్లు కనిపిస్తుంటాయి. కానీ ప్రపంచంలో తొలసారిగా రోడ్డుకు ఇరువైపు వెదురు క్రాష్ బారియర్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్, యావత్మాల్ జిల్లాల్లోని వాణి-వరోరా జాతీయ రహదారిపై వీటిని ఏర్పాటు చేశారు. హైవేకు 200 మీటర్ల పొడవున్న వెదురు క్రాష్ బారియర్ ను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శనివారం తెలిపారు. ‘‘ప్రపంచంలోనే ఇది తొలిసారి’’ అని ఆయన వెల్లడించారు. దీనికి ‘బాహుబలి’ అని పేరు పెట్టినట్లు ట్వీట్ చేశారు. దేశంలో వెదురు రంగానికి ఇది గొప్పవిజయమని అభివర్ణించారు. ఇది ఉక్కుకు సరైన ప్రత్యామ్నాయంగా ఆయన పేర్కొన్నారు.

Read Also: Manchu Manoj: మంచు మనోజ్ పోస్ట్.. మంచోడు అంటూ నెటిజన్స్ ఫిదా

ఆత్మనిర్భర భారత్ గా మారే దిశగా ఈ అసాధారణ విజయం సాధించబడిందని గడ్కరీ ట్వీట్ చేశారు. ఇండోర్ లోని పితాంపూర్ లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్(NATRAX), రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI)లో నిర్వహించిన పలు రకాల టెస్టుల తర్వాత దీన్ని ఏర్పాటు చేశామని, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ చేత గుర్తింపు పొందినట్లు గడ్కరీ ట్వీట్ లో తెలిపారు. వెదురు బారియర్లను మళ్లీ వినయోగించుకునేందుకు 50-70 శాతం అవకాశం ఉండగా, ఉక్కులో ఇది 30-50 శాతం మాత్రమే ఉంటుందని గడ్కరీ తెలిపారు.

ఈ వెదురు బారియర్లు బాంబూసా బాల్కోవా వెదురు జాతికి చెందినవి, దీనికి క్రియోసోట్ ఆయిల్ ట్రీట్మెంట్ ఇచ్చి, రీసైకిల్ చేయబడిని హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ తో పూత పూశారు. ఇది పర్యావరణ సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని గడ్కరీ అన్నారు.

Exit mobile version