Swati Maliwal: ఏం చేసినా ఏంపీ పదవికి రాజీనామా చేయను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే అతని సహాయకుడు బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా గురువారం స్వాతి మలివాల్ ఏఎన్ఐతో మాట్లాడారు. తన రాజ్యసభ్యత్వాన్ని ఒక లాయర్ కోసం వదులుకోవాలని ఆప్ ఒత్తిడి తెస్తుందనే వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఇటీవల కేజ్రీవాల్‌కి బెయిల్ రావడంలో సహకరించిన కాంగ్రెస్ నేత, లాయర్ అభిషేక్ సింఘ్వీ కోసం స్వాతి మలివాల్‌ని రాజీనామా కోరుతున్నారనే వార్తలు వెలువడ్డాయి.
Read Also: Planet Parade: ఆకాశంలో అద్భుతం.. జూన్ 3న ఒకే వరసలోకి ఆరు గ్రహాలు..
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
‘‘నా రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోమని వారు నన్ను మర్యాదపూర్వకంగా కోరినట్లయితే, నేను నా ప్రాణాన్ని ఇచ్చేదానిని, నేను ఎన్నడూ అత్యాశతో ఏ పదవి కోసం ప్రయత్నించలేదు’’ అని స్వాతి మలివాల్ అన్నారు. 2006లో ఎవరికీ తెలియనప్పుడు ఈ వ్యక్తులతో కలిసి పనిచేశానని, అందుకోసం తన ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదులుకున్నానని స్వాతి మలివాల్ ఆప్ ముఖ్యనేతలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో నేను ఖచ్చితంగా ఒక ముఖ్యమైన భాగాన్ని అని ఆమె అన్నారు. నేను ఏ పదవి లేకుండా కూడా పనిచేసే దానిని అని చెప్పారు.
అయితే, తాను ఇప్పుడు రాజీనామా చేయనని, తన పార్టీ తనకు చేసిన దానిని బట్టి చూస్తే, ఏ శక్తి కూడా తనను రాజీనామా చేయాలని అడగదని ఆమె అన్నారు. తన క్యారెక్టర్ని దెబ్బతీయడం గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాననే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. అహంకారం మీ తలకెక్కినప్పుడు మీరు ఏ తప్పును చూడలేదరి ఆప్ కీలక నేతలను గురించి ఆమె వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?