NTV Telugu Site icon

Swati Maliwal: ఏం చేసినా ఏంపీ పదవికి రాజీనామా చేయను..

Swati Maliwal

Swati Maliwal

Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే అతని సహాయకుడు బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా గురువారం స్వాతి మలివాల్ ఏఎన్ఐతో మాట్లాడారు. తన రాజ్యసభ్యత్వాన్ని ఒక లాయర్ కోసం వదులుకోవాలని ఆప్ ఒత్తిడి తెస్తుందనే వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఇటీవల కేజ్రీవాల్‌కి బెయిల్ రావడంలో సహకరించిన కాంగ్రెస్ నేత, లాయర్ అభిషేక్ సింఘ్వీ కోసం స్వాతి మలివాల్‌ని రాజీనామా కోరుతున్నారనే వార్తలు వెలువడ్డాయి.

Read Also: Planet Parade: ఆకాశంలో అద్భుతం.. జూన్ 3న ఒకే వరసలోకి ఆరు గ్రహాలు..

‘‘నా రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోమని వారు నన్ను మర్యాదపూర్వకంగా కోరినట్లయితే, నేను నా ప్రాణాన్ని ఇచ్చేదానిని, నేను ఎన్నడూ అత్యాశతో ఏ పదవి కోసం ప్రయత్నించలేదు’’ అని స్వాతి మలివాల్ అన్నారు. 2006లో ఎవరికీ తెలియనప్పుడు ఈ వ్యక్తులతో కలిసి పనిచేశానని, అందుకోసం తన ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదులుకున్నానని స్వాతి మలివాల్ ఆప్ ముఖ్యనేతలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో నేను ఖచ్చితంగా ఒక ముఖ్యమైన భాగాన్ని అని ఆమె అన్నారు. నేను ఏ పదవి లేకుండా కూడా పనిచేసే దానిని అని చెప్పారు.

అయితే, తాను ఇప్పుడు రాజీనామా చేయనని, తన పార్టీ తనకు చేసిన దానిని బట్టి చూస్తే, ఏ శక్తి కూడా తనను రాజీనామా చేయాలని అడగదని ఆమె అన్నారు. తన క్యారెక్టర్‌ని దెబ్బతీయడం గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాననే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. అహంకారం మీ తలకెక్కినప్పుడు మీరు ఏ తప్పును చూడలేదరి ఆప్ కీలక నేతలను గురించి ఆమె వ్యాఖ్యానించారు.