Site icon NTV Telugu

మూఢాచారం: అత్త ఫిర్యాదు… నిప్పులపై నడిచిన కోడలు…

దేశంలో ఎన్నో మూఢాచారాలు ఉన్నాయి.  పోలీస్ స్టేష‌న్లు, కోర్టులు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ అనేక గ్రామాల్లో పంచాయతీల్లో ఇచ్చే తీర్పుల‌కు క‌ట్టుబ‌డి ఉంటుంటారు.  ఎంత‌టి క‌ఠిన శిక్ష‌లు విధించినా మౌనంగా భ‌రిస్తుంటారు.  ఓ అత్త తక కోడ‌లిపై బాబా ద‌ర్బార్‌కు ఫిర్యాదు చేసింది.  బాబా ద‌ర్భార్ త‌న‌దైన శైలిలో కోడ‌ల‌కు వింత శిక్ష‌ను అమ‌లు చేశారు.  అంద‌రిముందు కోడ‌లు నిప్పుల్లో న‌డిచి నిరూపించుకోవాల‌ని అన్నారు.  చెప్పిన‌ట్టుగానే కోడ‌లు నిప్పుల్లో న‌డిచింది.  అయితే, ఈ త‌తంగాన్ని కొంత‌మంది సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేశారు.  బాబా ద‌ర్భార్ నిర్వ‌హిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ర‌మాకోనా అనే గ్రామంలో జ‌రిగింది.  ఈ గ్రామానికి చెందిన ఓ అత్త త‌క కొడిక్కి అన్నంలో మందుపెట్టి కోడ‌లు త‌న వ‌శం చేసుకుంద‌ని, త‌న మాట విన‌డంలేద‌ని చెప్పి బాబాద‌ర్భార్‌లో ఫిర్యాదు చేసింది.  ఏదైనా ఉంటే కూర్చోని ప‌రిష్క‌రించుకోవాలిగాని, ఇలా ద‌ర్భార్‌కు వెళ్లి ఇంటి గుట్టును రట్టు చేసుకోవ‌డం ఎందుక‌ని పోలీసులు చెబుతున్నారు.  

Read: పంజ్‌షీర్ ఫైట‌ర్స్‌: ఒక‌వైపు తాలిబ‌న్ల‌తో పోరు… మ‌రోవైపు క్రీడ‌లు…

Exit mobile version