NTV Telugu Site icon

Yoga at Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో యువతి యోగా.. సిక్కుల ఆగ్రహం..

Archana Makhwana

Archana Makhwana

Yoga at Golden Temple: సిక్కులకు పవిత్రమైన అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ఓ యువతి యోగా సాధన చేయడం వివాదాస్పదమైంది. అర్చనా మక్వానా అనే యువతి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న గోల్డెన్ టెంపుల్ ఆవరణలో ఆసనాలు వేసింది. వీటికి సంబంధించిన ఫోటోలనున సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే, ఈ వ్యవహారం సిక్కులకు ఆగ్రహం తెప్పించింది. మహిళపై చర్యలు తీసుకోవాలని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) పోలీసులకు ఫిర్యాదు చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు SGPC తన ముగ్గురు ఉద్యోగులను వారి ఉద్యోగాల నుండి తొలగించింది. ఇదే కాకుండా ఒక్కోక్కరికి రూ. 5000 జరిమానా విధించింది.

Read Also: Jharkhand: పాఠశాల ట్యాంక్ నీళ్లు తాగి 20 మంది విద్యార్థులకు అస్వస్థత

SGPC అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. మహిళ యోగా చేసి, ఎలాంటి ప్రార్థనలు చేయకుండా స్వర్ణదేవాలయం నుంచి వెళ్లిపోయిందని అన్నారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పవిత్ర స్థలాల యొక్క పవిత్రతను, చారిత్రక ప్రాముఖ్యతను విస్మరించి, హేయమైన చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పే ఇలాంటి పనులు చేయొద్దని ఆయన అన్నారు.

ఈ వివాదం నేపథ్యంలో మక్వానా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు నుంచి యోగా చేస్తున్న వీడియోలు, ఫోటోలను తొలగించింది. శనివారం ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో మక్వానా తాను చేసిన చర్యలకు క్షమాపణలు చెప్పింది. ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని పేర్కొంది. ‘‘గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో యోగా సాధన చేయడం కొంతమందికి అభ్యంతరకరంగా ఉంటుందని నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆయనను గౌరవిస్తున్నాను. ఇది ఎవరికి నొప్పించలేదు’’ అని మక్వానా అన్నారు. ఎవరికైనా తన చర్య బాధ కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడనని చెప్పారు. తన క్షమాపణలు అంగీకరించాలని కోరారు. ఇదిలా ఉంటే తాను క్షమాపణలు చెప్పినప్పటికీ, కొందరు ఫోన్ కాల్స్ ద్వారా చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ చెప్పారు.

Show comments