NTV Telugu Site icon

Crime News: ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై అత్యాచారం

Crime

Crime

మహిళలు, చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావివరసలు మరచిన కామాంధులు.. సొంతవారినీ వదలడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. ఇలాంటి వారిలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా విచక్షణ మరిచి ఉద్యోగం కోసం ముంబయి వచ్చి ఓ వివాహతపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగొట్టారు.

ఉద్యోగం వెతుక్కుంటూ ముంబయి వచ్చిన ఓ 19 ఏళ్ల వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు కొందరు కామాంధులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్​ చేశారు. “కోల్​కతాకు చెందిన ఓ 19 ఏళ్ల వివాహిత.. ఉద్యోగం కోసం తన బంధువుతో ముంబయికు వచ్చింది. కుర్లా ప్రాంతంలో ఆమెపై తన బంధువుతో పాటు మరో ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నలుగురు నిందుతుల్ని అరెస్ట్​ చేశాం.” అని పోలీసులు తెలిపారు.