Site icon NTV Telugu

Delhi: ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పులు..

Delhi

Delhi

Firing at Delhi’s Saket court: ఢిల్లీ సాకేత్ కోర్టు ప్రాంగణంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటన జరగగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం బాధితురాలికి చికిత్స జరుగుతోంది. పోలీసులు ప్రస్తుతం సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు హిస్టరీ-షీటర్ అని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన కారణాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఆర్థికలావాదేవీలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. లాయర్ వేషంలో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.

Read Also: Covid-19: దేశంలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే..?

గతేడాది సెప్టెంబర్ నెలలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇద్దరు దుండగులు లాయర్ డ్రెస్ ధరించి ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఒక దుండగుడు మరణించాడు. నిందితులు రాహుల్ త్యాగి, జగదీఫ్ జగ్గా లాయర్లలా నటిస్తూ కోర్టు రూంలోకి ఎంటర్ అయ్యారు. గ్యాంగ్ స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగిపై కాల్పులు జరిపారు.

Exit mobile version