Site icon NTV Telugu

Prajwal Revanna: “నా తల్లిపై అత్యాచారం చేసి, నన్ను బట్టలు విప్పేలా చేశాడు”.. రేవణ్ణ దురాగతాలను బయటపెట్టిన మహిళ..

Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna: జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ దురగాతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎంతో మంది మహిళపై అత్యాచారాలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఇటీవల వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి పట్టు ఉన్న హసన్ జిల్లాలో ఈ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. దాదాపుగా 3000 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం నుంచి జర్మనీకి వెళ్లారు. మరోవైపు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగిక వేధింపులు కూడా బయటపడ్డాయి. రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ రేవణ్ణతో పాటు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. దీంతో ఈ వ్యవహారం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మహిళ కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను సిట్ అరెస్ట్ చేయగా, ప్రజ్వల్ రేవణ్ణను దేశానికి రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే ప్రజ్వల్ రేవణ్ణ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2020-2021 మధ్య ప్రజ్వల్ రేవణ్ణ తనను బెదిరించాడని, తన తల్లికి హాని చేస్తానని బెదిరించి, తన బట్టలు తొలగించామని భయపెట్టినట్లు ఆరోపించింది. ‘‘ అతను నాకు ఫోన్ చేసి నా బట్టలు తీసేయమని కోరాడు. మా అమ్మ మొబైల్‌కి ఫోన్ చేసి వీడియో కాల్స్‌కి సమాధానం ఇవ్వాలని నన్ను బలవంతం చేసేవాడు. నేను నిరాకరిస్తే, మా అమ్మకు హాని చేస్తానని బెదిరించే వాడు. అతనిపై ఫిర్యాదు చేసిన సమయంలో తన కుటుంబం తమకు మద్దతు ఇచ్చింది’’ అని యువతి వెల్లడించింది. నా తల్లిని హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణలు రేప్ చేసి లైంగికంగా వేధించారని, ప్రజ్వల్ తనను లైంగికంగా వేధించాడని మహిళ ఆరోపించింది.

Read Also: General Elections 2024 Live Updates : సార్వత్రిక ఎన్నికలు 4వ దశ పోలింగ్‌ లైవ్‌ అప్డేట్స్‌

తనకు సహకరించకుంటే తన భర్త ఉద్యోగాన్ని తీయించేస్తానని, అతనిని నిరుద్యోగిగా చేస్తానని, తన కుమార్తెపై కూడా అత్యాచారం చేస్తానని ప్రజ్వల్ తన తల్లిని బెదిరించేవాడని సదరు మహిళ తెలిపింది. తాము కంప్లైట్ ఇచ్చిన తర్వాత తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పింది. 2020-21 మధ్య జరిగిన నిరంతర వేధింపులు తన కుటుంబంపై భారీ నష్టాన్ని చూపించాయని, వీరి ఆగడాలు తట్టుకోలేక ఫోన్ నెంబర్లు మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ప్రజ్వల్ తన నివాసంలోని మహిళా వర్కర్లను లైంగికంగా వేధించే వాడని చెప్పింది.

రేవణ్ణ పండ్లు ఇస్తాననే నెపంతో మహిళా పనిమనుషులను లైంగికంగా వేధించేవాడని, తన తల్లిపై ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడిన మాట వాస్తవమే అని సదరు మహిళ ఆరోపించింది. ఇప్పటికీ ముగ్గురు బయటకు వచ్చి ఈ సంఘటనపై బహిరంగంగా మాట్లాడారు. మరికొందరు ఈ దురాగతాలపై మాట్లాడలేదని, వారు కూడా లైంగిక వేధింపులకు గురయ్యారని మహిళ పేర్కొంది. ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత తమ భూమిని బలవంతంగా అమ్మేశారని చెప్పింది. ‘‘ నా తల్లి నాలుగు ఐదు నెలలకొకసారి మాత్రమే ఇంటికి వచ్చేదని, ఆమె చాలా వేధింపులకు గురైంది. ఆమె మాకు అర్ధరాత్రి 1 లేదా 2 గంటల సమయంలో మాత్రమే ఫోన్ చేస్తుంది. మా అమ్మను బానిసగా చేశారు, తన తండ్రిపై దాడి చేశారు’’ అని మహిళ ఆరోపించింది.

Exit mobile version