Woman in coma for 7 months gives birth to baby girl: ఏడు నెలలుగా కోమాలో ఉండీ.. ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఢిల్లీలోన ఎయిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్యశాస్త్రంలోనే అత్యంత అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఓ ప్రమాదం కారణంగా తలకు తీవ్రగాయాలు అయిన మహిళ గత ఏడు నెలల నుంచి ఎయిమ్స్ లోని ట్రామా సెంటర్లో కోమాలోనే ఉంది. ప్రమాదం జరిగే సమయానికి మహిళ గర్భవతి. అయితే వైద్యులు సదరు మహిళ పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుని గర్భంలో శిశువు ఎదిగేలా చికిత్స కొనసాగించారు. దీంతో ఏడు నెలల తర్వాత మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
Read Also: Bhatti Vikramarka: బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నాయి
బులంద్ షహర్ కు చెందిన 23 ఏళ్ల షఫియా అనే మహిళ ఓ ప్రమాదంలో గాయపడింది. తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లింది. ఏప్రిల్ 1న చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరింది. అప్పటికే షఫియా 40 రోజుల గర్భవతి. ఇప్పటికే ఆమెకు నాలుగు సార్లు న్యూరో సర్జికల్ ఆపరేషన్లు చేశారు వైద్యులు. ఆమె 18 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన తర్వాత గర్భంలో శిశువు ఆరోగ్యం ఉన్నట్లు నిర్థారించారు. ప్రస్తుతం మహిళ ఇంకా కోమాలోనే ఉందని.. ఆమె బతికే అవకాశాలు కేవలం 10-15 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ముందుగా మహిళ గర్భాన్ని ఉంచాలా..? వద్దా..? అనే దానిపై చర్చించామని.. అయితే గర్భంలో ఉన్న శిశువు హెల్తీగా ఉండటంతో వైద్యులు, కుటుంబ సభ్యులు గర్భం కొనసాగించేందుకే మొగ్గు చూపాలరు. ముందుగా తల్లి ఆరోగ్యం దృష్ట్యా గర్భం కొనసాగించే విషయాన్ని కుటుంబ సభ్యులకే వదిలేశారు వైద్యులు. అయితే గర్భం కొనసాగించేందుకే కుటుంబీకులు మొగ్గు చూపారు. అక్టోబర్ 22న మహిళ, ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఇది చాలా అసాధారణం అని.. ఎయిమ్స్ లో 22 ఏళ్ల న్యూరో సర్జికల్ కెరీర్లో నేను ఇలాంటి కేసును చూడలేదని డాక్టర్ దీపక్ గుప్తా అన్నారు.
