NTV Telugu Site icon

Uttar Pradesh: కదులుతున్న రైలులో మహిళపై టీటీఈ అత్యాచారం..

Uttar Pradesh

Uttar Pradesh

Woman Gangraped By TTE, Another Man On Moving Train: ఉత్తర్ ప్రదేశ్ లొో ఘోరం జరిగింది. కదులుతున్న రైలులో ఓ మహిళపై టీటీఈ, మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంభాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడైన టీటీఈని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అత్యాచార ఘటన జనవరి 16న సంభాల్ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు.

Read Also: Pakistan: పాక్‌లో హిందువులపై ఆగని అఘాయిత్యాలు.. హిందూ బాలిక కిడ్నాప్, అత్యాచారం

నిందితుడు టీటీఈని రాజు సింగ్ గా గుర్తించారు. సంభాల్ జిల్లాలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. జనవరి 16న మహిళ చందౌసి రైల్వే స్టేషన్ లో వేచిచూస్తున్న సమయంలో నిందితుడు పథకం ప్రకారం ఆమెను ఏసీ కోచ్ లో కూర్చోపెట్టాడు. మహిళ చందౌసి నుంచి ప్రయాగ్ రాజ్ లోని సుబేదర్ గంజ్ కు వెళ్తోంది. ఈ క్రమంలో మహిళపై టీటీఈ, మరో వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మహిళ మరో వ్యక్తిని గుర్తించలేదు. చాలా మంది టీటీఈలను పోలీసులు మహిళకు చూపించనప్పటికీ అందులో రెండో నిందితుడు లేదు. రెండో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376డీ కింద కేసులు నమోదు చేశారు. కేసును విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.