NTV Telugu Site icon

Delhi Metro: ఇంట్లో ప్లేస్‌ లేదా తల్లీ.. మెట్రోలో ఆడుకుంటున్నావ్‌..

Delhi Metro

Delhi Metro

Delhi Metro: మెట్రో రైలులో ప్రయాణించే వ్యక్తి సాధారణంగా ఏం చేస్తాడు? కూర్చుని ఫోన్‌లో బ్రౌజ్ చేస్తూ ఉండండి లేదా సహ-ప్రయాణికులతో మాట్లాడండి లేదా వారి గమ్యస్థానం కోసం వేచి ఉండటం.. కానీ ఈకాలం యువత అడపదడప రీల్స్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వ్యూస్ కోసం తాపత్రయ పడుతున్నారు. రీల్స్‌ చేయడానికి ఒక ప్లేస్‌ అంటూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్‌ చేసేందుకు వెనకాడటం లేదు. ఒకరు చూస్తారనే భయంలేదు. విచ్ఛలవిడిగా రీల్స్‌ చేసి దానిని పోస్ట్‌ చేసి కామెంట్స్‌, వ్యూస్‌ కోసం తాప్రతయ పడుతున్నారు. రోడ్డు, పార్క్‌, వాష్‌ రూమ్స్‌, ఇప్పుడు ఏకంగా మెట్రోను కూడా రీల్స్‌ చేయడానికి వాడుకుంటున్నారు. అయితే ఢిల్లీ మెట్రోలోనే గత సంవత్సరం ఓవ్యక్తి టవాల్‌ కట్టుకుని మెట్రోలో అద్దాలను చూసుకుంటూ హెయిర్‌ స్టైల్‌ చేస్తున్న వీడియో వైరల్‌ గా మారగా.. దానిని అధికారులు అస్సలు పట్టించుకోకపోడమే ఈఘటనకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఢిల్లీ మెట్రోలో ఓ యువతి విచిత్రమైన వికృత చేష్టలు చేసి ఆ వీడియోను సోషల్ మీడయాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు సీరియస్‌ అవుతున్నారు. మెట్రో అంటే గమ్యస్థానానికి చేర్చడం అంతేగానీ.. మెట్రోలో ఈ వెకిలి చేష్టలేంటని మండిపడుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంటల్లో స్థలం లేదా? నీకు ఆడుకోవడానికి మెట్రోనే దొరికిందా? సోయలేకుండా ఆ వెకిరిచేష్టలు ఏంటి? కెమెరాలను చూస్తూ కూడా భయంలేకుండా ముద్దులు పెట్టడం ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అపర్ణా దేవ్యాల్ అనే ఒక మహిళ మెట్రో కోచ్‌లో తన ప్రయాణాన్ని అక్షరాలా ఆనందిస్తున్నట్లు చూపిస్తుంది ఈవీడియోను తీసి ఒక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేసింది. మెట్రో రైలు ప్రయాణిస్తుంటే హ్యాండ్ హోల్డింగ్స్‌ని గట్టిగా పట్టుకొని ఊయల ఊగడం వెకిలి చేష్టలు చేయడం సీట్లపై కూర్చుని బోర్డుపై తను మోసుకెళ్ళే మృదువైన బొమ్మతో పోజులివ్వడం. హాయ్‌ అంటూ వెర్రి చేష్టలు చేస్తుంటే ఎదురుగా కూర్చున్న మరో అమ్మాయి దేవ్యాల్ చేష్టలు ఫోన్‌ లో బంధించడం మనకు ఈ వీడియోలో కనపడతాయి. అంతేకాకుండా.. అక్కడున్న సీసీ కెమెరాను చూసి అపర్ణా దేవ్యాల్ ఫ్లైయింగ్‌ ముద్దు పెట్టడం పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా చూస్తారనే భయం కూడా లేకుండా మెట్రోలో వెకిరి చేష్టలు చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈవీడియో చూసిన కొందరు నెటిజన్లు “సీట్ అనేది శారీరకంగా వికలాంగులకు కాదు మానసికంగా” అని రాసుకొచ్చారు. ఈమెకు వెర్రి ఎక్కువైనట్టుంది అందుకే ఆసుపత్రి అనుకుని మెట్రో ఎక్కినట్టుంది. ఆమెకు తిక్క పట్టింది వెర్రితనానికి పరాకాష్టగా ఈవీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఢిల్లీ మెట్రో అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి?
Kamareddy Master Plan: మాస్టర్‌ ప్లాన్‌ పై ముగిసిన సమావేశం.. 11న రైతు జే.ఏ.సి. ధర్నా

Show comments