NTV Telugu Site icon

JK Floods: జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరి పిల్లలతో ప్రవాహంలో కొట్టుకుపోయిన తల్లి

Cloudburst

Cloudburst

జమ్మూకాశ్మీర్‌లోని రాజ్‌గఢ్, రాంబన్‌లో ఒక్కసారిగా బుధవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ప్రవాహం ఏరులైపారింది. ఆకస్మిక వరదల్లో మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. మరో నలుగురు తప్పిపోయారు. రంగంలోకి దిగిన జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీలో చేరే నేతలకు చంద్రబాబు షాక్.. అలా అయితేనే రండి

రాజ్‌గఢ్‌లోని కుమాటే ప్రాంతంలోని ఒక పాఠశాల భవనం, వాటర్ మిల్లు, నాలుగు వాహనాలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయని వార్తలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని ప్రజలను డిప్యూటీ కమిషనర్ బసీర్-ఉల్-హక్ కోరారు.

ఇది కూడా చదవండి: High Court: నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు? మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో వరదలు కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కార్లు కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన ప్రభుత్వం.. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే ఢిల్లీలో కూడా భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.