Site icon NTV Telugu

PM Modi election campaign: 200కి పైగా పబ్లిక్ మీటింగ్స్, 80 ఇంటర్వ్యూలు.. ఎన్నికల ప్రచారంలో మోడీ రికార్డ్..

Pm Modi

Pm Modi

PM Modi election campaign: ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. చివరిదైనా ఏడో విడతతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారంలో రావడానికి, బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రధాని ఏడు పదుల వయసులో దాదాపుగా ప్రతీ రోజు మూడు నుంచి ఐదు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం సుడిగాలిలా దేశాన్ని చుట్టి వచ్చారు. శనివారం జరగబోతున్న చివరది దశ ఎన్నికల కోసం గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని మే 30 నుంచి జూన్ 1 వరకు తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనునన్నారు. అక్కడ ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్‌ని సందర్శిస్తారు. మే 30 సాయంత్ర నుంచి జూన్ 1 సాయంత్రం వరకు స్వామి వివేకానంద ఒకప్పుడు ధ్యానం చేసిన ధ్యాన్ మండపంలో ప్రధాని ధ్యానం చేయనున్నారు. గతంలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని ఆధ్యాత్మిక పర్యటనలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2019లో కేదార్‌నాథ్‌ను సందర్శించిగా, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు.

Read Also: Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..?

అయితే, దాదాపుగా 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 75 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రధాని ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 16న కన్యాకుమారి ప్రచారంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 75 రోజుల వ్యవధిలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో 200 కంటే ఎక్కువ ఎన్నికల ప్రచార సభలు, కార్యక్రమాలకు ప్రధాని హాజరయ్యారు. దీంతో పాటు నేషనల్, ప్రాంతీయ ఛానెళ్లు, మీడియా అనే బేధం లేకుండా 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇదే కాకుండా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు ఒడిశాలో ఎక్కువ రోడ్ షోలు నిర్వహించారు.

ప్రధాని ప్రచారంలో ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ కోటా రిజర్వేషన్లు ప్రముఖ ప్రచారం అస్త్రంగా మారింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దళితులు, వెనకబడిన వారికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తుందని ఆయన విస్తృతంగా ఆరోపించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘‘సంపద పునర్విభజన’’ అంశంపై ఆ పార్టీపై ప్రధాని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లులు, సోదరీమణుల మంగళసూత్రాలను లాగేస్తుందని, మన సంపద చొరబాటుదారులకు ఇస్తారని చెప్పారు. ఇక కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడా, ఫరూఖ్ అబ్దుల్లాలు చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీకి ప్రచారానికి పనికొచ్చాయి.

Exit mobile version