Site icon NTV Telugu

Wipro: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. ఒక్క గంట తక్కువైనా..

Wipro

Wipro

Wipro: అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల వర్క్ పాలసీని కఠినతరం చేస్తున్నాయి. తాజాగా విప్రో కూడా తన ఉద్యోగులకు ‘‘హైబ్రీడ్ వర్క్ పాలసీ’’ని మరింత కఠినతరం చేసింది. ఇకపై ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే రోజుల్లో, కనీసం 6 గంటలు ఖచ్చితంగా ఆఫీస్‌లో ఉండాలని ఆదేశించింది. ఉద్యోగులు 3 రోజులు ఆఫీసుకు, మరో మూడు రోజులు ‘‘వర్క్ ఫ్రం హోమ్’’ను విప్రో ఇప్పటికే అమలు చేస్తోంది.

Read Also: Dhurandhar vs The Raja Saab: దురంధర్ రికార్డులను ‘రాజా సాబ్’ బద్దలు కొడతాడా..?

ఆఫీస్‌లో ఉండే రోజుల్లో ‘‘ఇన్’’ నుంచి ‘‘అవుట్’’ వరకు 6 గంటలు ఆఫీస్‌లోనే ఉండాలి, మొత్తంగా 9 9.5 గంటలు పని చేయాలి. ఇందులో మూడు గంటలు ఇంటి నుంచి పని చేయవచ్చు. 6 గంటల కన్నా తక్కువ ఆఫీస్‌లో ఉంటే హాఫ్ డే లీవ్ కట్ చేసే అవకాశం ఉంది. కొత్త పాలసీ జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిర్ణయాన్ని హెచ్‌ఆర్ టీం ఇప్పటికే ఉద్యోగులకు ఈమెయిళ్ల ద్వారా తెలియజేసింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను ఎవరైనా ఉద్యోగి విఫలమైతే, అది వారి లీవ్స్‌పై ప్రభావం చూపించవచ్చు.

ఉద్యోగికి అనారోగ్యానికి గురైనప్పుడు గరిష్టంగా 15 రోజుల వరకు, అలాగే కుటుంబ సంరక్షణకు మరో 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఉండేది. అయితే, జనవరి 1 నుంచి మాత్రం ఈ సౌలభ్యాన్ని విప్రో తగ్గించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఏడాదికి రిమోట్ వర్క్ డేస్‌ను 15 రోజుల నుంచి 12 రోజులకు తగ్గించింది. ఫ్యూచర్ హైబ్రీడ్ వర్క్‌దే అని విప్రో చెబుతున్నప్పటికీ, దీనిని క్రమబద్ధంగా అమలు చేయడానికి మార్పులు చేసినట్లు చెప్పింది.

Exit mobile version