Site icon NTV Telugu

Nirmala Sitharaman Budget: ఈసారి బడ్జెట్ ఎప్పుడు?.. సాంప్రదాయానికి భిన్నమేనా..!

Nirmala Sitharaman Budget

Nirmala Sitharaman Budget

ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1 (ఆదివారం) వచ్చింది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 1నే ప్రవేశపెడతారా? లేదంటే ఫిబ్రవరి 2కు మారుస్తారా? అన్నది సందిగ్ధం నెలకొంది. అరుణ్ జైట్లీ తీసుకొచ్చిన పద్ధతి ప్రకారం ఆదివారమే నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర పెద్దలు గానీ.. నిర్మలమ్మ గానీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: Trump: చెప్పినట్లు వినకపోతే నీకు అదే గతి.. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ వార్నింగ్

ఇక 2026 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రూ.11 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నిర్మలమ్మ బడ్జెట్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: సోమనాథ్‌.. కోట్లాది మంది ఆత్మశక్తి.. ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం!

ఇక 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యంలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఆ దిశగా కూడా బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. రాబోయే బడ్జెట్‌లో తగిన వనరులను కేటాయించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇక రాబోయే బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వం విత్తన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Exit mobile version