దేశ వ్యాప్తంగా ఇటీవల రైల్వే ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైల్వే ప్రయాణాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తాజాగా ఇదే అంశంపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. కవచ్ ఏర్పాటుకు సర్కార్ ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. గురువారం లోక్‌సభ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయంలో రైల్వే వ్యవస్థలోని లోపాలను ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Gottipati Ravi Kumar: ఎన్నికల టైంలో పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్ధులు మరణించారు..
వందే భారత్‌లో స్లీపర్ రైళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. తొలి రైలు ట్రయల్‌లో ఉందన్నారు. వందే భారత్, అమృత్ భారత్, వందే మెట్రో, వందే స్లీపర్‌లు రాబోయే రోజుల్లో మెరుగైన సేవలను అందించనున్నాయని తెలిపారు. రైల్వేలు దేశానికి జీవనాధారం అని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో దీన్ని పాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నారు. గత యూపీఏ హయాంలో అయితే రైల్వే వ్యవస్థ దారుణంగా ఉండేదని కేంద్రమంత్రి విమర్శించారు.
ఇది కూడా చదవండి: Cyber fraud: మహారాష్ట్ర మాజీ సీఎం పేరుతో రూ.40 లక్షలకు టోకరా