Site icon NTV Telugu

India Pakistan: “మోడీ ఏమైనా నా అత్త కొడుకా.? యుద్ధం వస్తే నేను ఇంగ్లాండ్ పారిపోతా”: పాక్ ఎంపీ..

Pak Mp

Pak Mp

India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో 26 మంది ప్రజలు చనిపోవడంతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ ‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌పై ప్రతీకారం కోసం చూస్తోంది. ఇప్పటికే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. అయితే, పాక్ నేతలు మాత్రం ‘‘యుద్ధ భాష’’ మాట్లాడుతూ, భారత్‌ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also: Punjab Kings: మాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌.. పీఎస్‌ఎల్ 2025 నుంచి నేరుగా ఐపీఎల్‌కి!

ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్రిక్తతల నడుమ, భారత్‌తో యుద్ధం జరిగితే తుపాకీ తీసుకుని సరిహద్దుకు వెళ్తారా..? అని ఓ విలేకరి ప్రశ్నించిన నేపథ్యంలో, ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ సమాధానమిస్తూ..‘‘భారతదేశంతో యుద్ధం ప్రారంభమైతే నేను ఇంగ్లాండ్‌కు వెళ్తాను” అని అన్నారు.

భారత ప్రధాని నరేంద్రమోడీ ఉద్రిక్తతలను తగ్గించడానికి వెనక్కి తగ్గుతాడని మీరు నమ్ముతారా..? అని అడిగినప్పుడు, మార్వత్ వ్యంగ్యంగా స్పందిస్తూ, ‘‘నేను చెబితే వినడానికి మోడీ నా అత్త కొడుకా..?’’ అని అడిగారు. అతడి వీడియో ఇప్పుడు వైరల్‌‌గా మారింది. పాకిస్తాన్ రాజకీయ నాయకులకు కూడా వారి సైన్యంపై నమ్మకం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మార్వత్ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ సభ్యుడు. అయితే, పార్టీపై పలుమార్లు విమర్శలు చేయడం వల్ల ఇమ్రాన్ ఖాన్ అతడిని తొలగించారు.

Exit mobile version