Site icon NTV Telugu

Free Beer and Whisky: “పేదవారికి ఉచితంగా విస్కీ, బీర్ ఇస్తాం”.. ఎంపీ అభ్యర్థి విచిత్రమైన హామీ..

Vanita Raut

Vanita Raut

Lok Sabha Elections: మహారాష్ట్ర చంద్రపూర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్ తన విచిత్రమైన హామీలో వార్తల్లో నిలిచారు. చంద్రపూర్ జిల్లా చిమూర్ గ్రామానికి చెందిన వనితా రౌత్, తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు సబ్సిడీపై విస్కీ, బీర్ అందిస్తానని ప్రకటించారు. 2019లో కూడా పోటీ చేసిన రౌత్, ఇదే హామీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అఖిల భారత మానవతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వనితా రౌత్ పేద ఓటర్ల కోసం వినూత్నమైన హామీని తెరపైకి తీసుకువచ్చారు.

రౌత్ మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో బీర్ బార్‌లను తెరవడమే కాకుండా నియోజకవర్గం నుంచి తాను ఎన్నికైతే ఎంపీ ఫండ్ నుంచి పేదలకు ఇంపోర్టెడ్ విస్కీ, బీర్‌లను ఉచితంగా అందిస్తానని చెప్పారు. రేషన్ సిస్టమ్ ద్వారా దిగుమతి చేసుకున్న మద్యాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. తాగేవారు, విక్రేతలు లైసెన్సులు పొంది ఉండాలని అన్నారు.

Read Also: Sheikh Hasina: “మీ భార్యల భారతీయ చీరలని కాల్చండి”.. “ఇండియా ఔట్‌” ప్రచారంపై పీఎం హసీనా ఆగ్రహం..

ఆమె తన హామీని చాలా మంచిగా సమర్థించుకుంటున్నారు. అతిపేద ప్రజలు చాలా కష్టపడుతారు, మద్యపానంతో మాత్రమే వారికి సాంత్వన పొందుతారు, కానీ వారికి నాణ్యమైన విస్కీ, బీర్ కనుగొలు చేసే శక్తి లేదు. వారు కేవలం దేశీ మద్యాన్ని మాత్రమే తాగుతారు. వారు ఇంపోర్టెడ్ లిక్కర్‌ని టేస్ట్ చేయాలని కోరుకుంటారు, దానిని వారికి అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.
యుక్త వయసు వచ్చిన తర్వాత మాత్రమే మద్యం తాగడానికి ప్రజలకు లైసెనస్ ఇవ్వాలని ఆమె సూచిస్తోంది. మితిమీరిన మద్యపానం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నయని కదా అని ప్రశ్నిస్తే.. మద్యం కొనుగోలు చేయడానికి ప్రజలకు లైసెన్స్ పొందాలని ఆమె చెబుతున్నారు.

వనితా రౌత్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికలలో, ఆమె నాగ్‌పూర్ నుండి పోటీ చేయగా, 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆమె చిమూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసింది. 2019 ఎన్నికల్లో ఆమె ఈ ఉచిత మద్యం అనే హామీని తెరపైకి తెచ్చారు. ఈ హామీపై ఎన్నికల అధికారులు ఆమె డిపాజిట్‌ని జప్తు చేశారు. అయితే, ఈ సారి కూడా ఆమె తన హామీ నుంచి వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నారు.

Exit mobile version