NTV Telugu Site icon

Wife Pours Boiling Oil: నిద్రిస్తున్న భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య.. కారణం ఏంటంటే..

Wife Pours Boiling Oil

Wife Pours Boiling Oil

Wife Pours Boiling Oil: భార్యభర్తల మధ్య వాగ్వాదం తీవ్ర చర్యకు దారి తీసింది. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన ముంబై పొరుగున ఉన్న థానేలో చోటు చేసుకుంది. అద్దె ఇంటిని ఖాళీ చేసే విషయంలో ఇరువురి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ, ఈ దారుణమైన ఘటనకు కారణమైంది. థానేలోని భివాండి ప్రాంతంలో జూలై 11, గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. గొడవ తర్వాత భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య మరుగుతన్న నూనె పొసిందని పోలీసులు వెల్లడించారు.

Read Also: Hardik Pandya Viral Video: అనంత్ అంబానీ పెళ్లిలో హార్దిక్ వీడియోపై చర్చ..ఇంతకీ ప్యాండ్యా ఏమి ఆర్డర్ చేశారు..?

దంపతులు నిందిస్తున్న అద్దె ఇంటిని ఖాలీ చేయడంపై ఇరువురు గొడవ పడ్డారు. బాధితుడు రెహమాన్ అన్సారీ(32)పై వేడి నూనె పోయడంతో అతని కళ్లు, శరీరం, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం సియోన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు అన్సారీ భార్య సిరిన్ అన్సారీ(30)పై పోలీసులు కేసు నమోదు చేశారు. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని విచారణలో తేలింది. గురువారం రాత్రి అన్సారీ పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇళ్లు, డబ్బు విషయంలో భార్య సిరిన్‌తో గొడవ జరిగినట్లు తెలిసింది.

దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా వారం రోజులు క్రితం ఇదే విషయమై అన్సారీ తన భార్య సిరిన్‌ని వేధించాడని పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం అన్సారీ కూలీ పనులు చేసే వాడని వెల్లడించారు. పదేళ్ల క్రితం వివాహమైన వీరిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా వీరిని ఇంటి యజమాని ఖాళీ చేయమని కోరాడు. దీంతోనే ఇద్దరి మధ్య వివాదం కాస్త వేడి నూనె పోసే వరకు వెళ్లింది.

Show comments