Site icon NTV Telugu

Delhi High Court: ఆర్థిక పరిమితికి మించి భార్య కోరికలు కోరడం.. భర్తను మానసిక ఒత్తిడికి గురిచేయడమే..

Delhi High Court Verdict

Delhi High Court Verdict

Delhi High Court: భర్త ఆర్థిక పరిమితికి మించి కోరికలు, కలలని నెరవేర్చాలని భార్య ఒత్తిడి చేయడం నిరంతర అసంతృప్తికి కారణమవుతుందని, చివరకు వైవాహిక జీవితంలో సంతోషం, సామరస్యానికి భంగం కలుగుతుందని, ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్య క్రూరత్వం కారణంగా ఓ జంట విడాకుల కేసులో, విడాకులను సమర్థిస్తూ.. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

Read Also: Chiranjeevi: LK అద్వానీకి భారతరత్న.. రాజకీయ నాయకుల గౌరవాన్ని పెంచారు

ఒక వ్యక్తి ఆర్థిక పరిమితులను భార్య నిరంతరం గుర్తు చేయొద్దని, అవసరాలు, కోరికలకు మధ్య జాగ్రత్తగా నడుచుకోవాలని న్యాయమూర్తులు చెప్పారు. భార్య క్రూరత్వానికి సంబంధించి భర్తకు విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ అతని భార్య హైకోర్టును ఆశ్రయించింది. అయితే, భార్య వేసిన పిటిషన్‌ని హైకోర్ట్ డివిజన్ బెంచ్ కొట్టిసింది. ‘‘ ఈ సంఘటన పెద్దగా హానికరమైనవి, చిన్నవిగా కనిపించినప్పటికీ.. కొంత కాలం తర్వాత అటువంటి ప్రవర్తన ఒక మానసిక ఒత్తిడికి దారి తీయెచ్చు. దీని వల్ల భార్యభర్తలు తమ వైవాహిక మనుగడ సాగించడం అసాధ్యం.’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. విడాకులను సమర్థించింది.

భార్య ప్రవర్తన పట్ల భర్త చెప్పి విభిన్న సంఘటనలు, అతనితో విభేదాలు పరిష్కరించుకునే పరిపక్వత లేని భార్య ‘సర్దుబాటు లేని వైఖరి’ ఫలితంగా విడాకులకు దారి తీసిందని బెంచ్ పేర్కొంది. భార్య వైఖరి అతనికి ఆందోళన కలిగించడమే కాకుండా.. మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 (ఎ) (ii) ప్రకారం జంట విడాకులను బెంచ్ సమర్థించింది. సెక్షన్ 9 ప్రకారం ఒక ఏడాదితో దాంపత్య హక్కుల పునరుద్ధరణ జరగకపోతే వివాహ రద్దును ఏ పక్షం అయినా కోరవచ్చని చెప్పింది.

Exit mobile version