Wife Eloped With Boyfriend In Bangalore: కొందరు అమ్మాయిలకు ఇదేం పాడుబుద్ధో తెలీదు కానీ, పెళ్లయ్యాక తమ ప్రియుళ్లతో పారిపోతారు. ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న భర్తల్ని నట్టేట ముంచేసి, ఏదో గొప్ప పని చేయబోతున్నట్టుగా ఇళ్లు వదిలి వెళ్లిపోతారు. అంతటితో ఆగకుండా.. భర్త సొమ్ముని సైతం దోచుకెళ్లిపోతారు. పాపం.. ఆ భర్త ఎంతో ఆశించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, వాళ్లు మాత్రం పిచ్చోళ్లని చేసి శఠగోపం పెట్టి ఉడాయిస్తారు. ఇప్పుడు ఓ యువతి కూడా అదే పని చేసింది. తన భర్తను మోసి చేసి, ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Devara: ఆ దేవరే ఫాస్ట్ అంటే ఈ దేవర మరింత ఫాస్ట్ గా ఉన్నాడే
కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కుందాపుర వడేరహోబళికి చెందిన ఓ యువతి కొంతకాలం నుంచి ఒక యువకుడ్ని ప్రేమిస్తోంది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ.. ఆమె కుటుంబసభ్యులు అందుకు ఒప్పుకోలేదు. కారణం ఏంటో తెలీదు కానీ.. ఆ యువకుడితో పెళ్లికి ససెమిరా అనేశారు. అంతేకాదు.. ఎక్కడా ఆ యువకుడితో వెళ్లిపోతుందేమోనన్న భయంతో, మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. అనుకున్నదే తడువుగా.. మే 21వ తేదీన వివాహం చేశారు. అయితే.. పెళ్లి అయ్యాక కూడా ఆ యువతి తన ప్రియుడితో టచ్‌లో ఉండేది. రోజూ అతనితో వీడియో కాల్‌లో మాట్లాడేది. తన భర్తను పెద్దగా పట్టించుకునేది కాదు. పద్ధతి మార్చుకోవాలని అటు పుట్టింటివారు, ఇటు మెట్టింటివారు చెప్పినా మారలేదు.
Vitality Blast: ధోని తరహాలో ఫినిష్.. మొదటిసారిగా ఫైనల్కి అడుగుపెట్టిన జట్టు..!
ఇక భర్తతో కాపురం చేయడం తన వల్ల కాదనుకున్న ఆ యువతి.. లేచిపోదామని ప్రియుడికి ఫోన్‌లో చెప్పింది. అందుకు అతను కూడా ఒప్పుకోకపోవడంతో.. జూన్ 16వ తేదీన ఇంట్లో ఉన్న రూ.10 లక్షల విలువైన బంగారంతో పాటు కొంత నగదు తీసుకుని ప్రియుడి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి వాళ్లిద్దరు మాయమైపోయారు. జూన్ 16న భర్త ఇంటికొచ్చి చూడగా.. తన భార్య కనిపించకపోవడం, నగలు & నగదు కూడా లేకపోవడం గమనించి.. ప్రియుడితో తన భార్య వెళ్లిపోయిందని ఫిక్సైపోయాడు. ఇది ఇరువురి ఇళ్లల్లో పెద్ద రాద్ధాంతానికి దారితీసింది. చివరగా ఈ ఘటనపై ఈనెల 12న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
