NTV Telugu Site icon

Wife Beats Husband: సీన్ రివర్స్… భార్యపై భర్త గృహహింస కేసు

Rajastan

Rajastan

గృహహింస కేసుల్లో చాలా సందర్భాల్లో మహిళలే బాధితురాలుగా ఉంటారు. వరకట్న వేధింపులు కావచ్చు, ఇతర కారణాలతో భార్యలను హింసిస్తూ ఉంటారు. ఇలాంటి కేసులను ఇప్పటి వరకు చాలానే చూశాం. కానీ రాజస్తాన్ లో సీన్ రివర్స్ అయింది. భార్యే భర్తపై గృహహింసకు పాల్పడుతోంది. చాలా ఏళ్లుగా తనను హింసిస్తుందంటూ కోర్ట్ లో కేసు పెట్టాడు. వింతగా ఉన్న ఈ కేసు రాజస్తాన్ ఆల్వార్ జిల్లా భీవాడీలో చోటు చేసుకుంది.

కోర్ట్ లో భార్యపై గృహహింస కేసుపై కోర్టును ఆశ్రయించాడు. ఇందుకు సాక్ష్యంగా భార్య తనపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన వీడియోను కూడా సాక్ష్యంగా చూపాడు. తన భార్య ఏడాది పాటు తనపై చేసిన చిత్ర హింసలకు సంబంధించి సీసీ కెమెరా పుటేజీని కోర్ట్ కు అందించాడు. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న అజిత్ యాదవ్… 9 ఏళ్ల క్రితం సుమన్ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే గత కొన్నేళ్లుగా  భార్య సుమన్, భర్త అనిల్ యాదవ్ ను తీవ్రంగా చిత్రహింసలు పెడుతుంది. అయితే సమాజంలో పరువు పోతుందని అజిత్ యాదవ్ వీటన్నింటిని మౌనంగా భరించారు. ప్రిన్సిపాల్ గా ఉన్న అజిత్ యాదవ్ ను సుమన్ ప్రతీరోజు కొట్టేది.  కొన్ని సార్లు తన కొడుకు ముందే భార్య తనను కొట్టేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  అయితే కొన్ని సార్లు కేసుల్లో ఇరికిస్తానని సుమన్, తనను బ్లాక్ మెయిల్ కూడా చేసేదని అజిత్ యాదవ్ పేర్కొన్నాడు. భార్య బండారాన్ని బయటపెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాలను అమర్చాడు. సదరు ఉపాధ్యాయుడికి భద్రత కల్పించాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుమన్ తన భర్తను కొట్టిన వీడియో తనెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.