NTV Telugu Site icon

Weather Alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరికలు

Imd Rain

Imd Rain

దేశంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (Weather Alert) హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఏఏ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయో తెలియజేస్తూ వివరాలు వెల్లడించింది.

అనేక రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో రాబోయే మూడు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక మంగళవారమే అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌లో భారీ వర్షాలకు సూచనగా ఉండనున్నాయని తెలిపింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల అధికారులకు ఐఎండీ సూచించింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంగలు పొంగిపొర్లుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మరింతగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Show comments