Vijayapriya Nithyananda: విజయప్రియ నిత్యానంద ఎవరు..? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. భారత్ తో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మతగురువు నిత్యానంద ‘కైలాస’ అనే ప్రత్యేక దేశాన్ని స్థాపించారు. అయితే ఈ దేశానికి ప్రతినిధులుగా ఇటీవల ఐక్యరాజ్యసమితిలో విజయప్రియ నిత్యానంద కనిపించారు. తనను తాను ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నారు.
హిందూమతం ఉట్టిపడేలా చీరకట్టు, ఆభరణాలు, మెడలో రుద్రాక్షమాల, నుదుటన బొట్టుతో ప్రపంచం చూపును తనవైపు ఆకర్షించుకుంది. హిందూమతంతోని ప్రాచీన సంప్రదాయాలను పునరుద్దరించినందుకు నిత్యానంద వేధింపులకు గురవుతున్నారని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకుంటూ మాట్లాడారు. ఆయన పుట్టిన దేశమే ఆయన్ను నిషేధించారని అన్నారు.
Read Also: Tripura: బీజేపీని సవాల్ చేసిన త్రిపా మోథా.. ఆ ఒక్కటి తప్పా అన్నింటికి సిద్ధమన్న కాషాయపార్టీ..
ప్రస్తుతం ఆమె గురించి ప్రపంచం అంతా శోధిస్తోంది. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఓ ఫోటోలో విజయప్రియ తన కుడి చేతిపై నిత్యానంద టాటూను కలిగి ఉంది. విజయప్రియ తన లింక్డ్ ఇన్ ఫ్రొఫైల్ ప్రకారం ఆమె మానిటోబా యూనివర్సిటీ నుంచి మైక్రోబయాలజీలో బీఎస్సీ ఆనర్స్ చేసినట్లు, జూన్ జూన్ 2014లో యూనివర్సిటీ డీన్ హానర్ లిస్టులో కూడా ఈమె పేరు ఉంది. విజయప్రియకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, క్రియోల్, పిడ్జిన్ భాషలు తెలుసని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో ఉంది.
ఇండియాలో కేసులు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019 లో ఈక్వెడార్ తీరంలో ఒక ద్వీపంలో ‘కైలాస’ని స్థాపించాడు. దీనిని ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి చట్టాలు, మంత్రులు, బ్యాంకులు ఇలా అన్నింటిని ఏర్పాటు చేశారు. 150 దేశాల్లో తమకు రాయబార కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని ‘కైలాస’ వెబ్‌సైట్ కూడా పేర్కొంది. అయితే విజయప్రియ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.