NTV Telugu Site icon

Surinder Choudhary: జమ్మూకాశ్మీర్ డిప్యూటీ సీఎంగా సురీందర్ చౌదరి

Surinderchoudhary

Surinderchoudhary

జమ్మూకాశ్మీర్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఒమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లాతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Income Tax : కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!

ఇక సురీందర్ చౌదరిని జమ్మూకాశ్మీర్ డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎన్నుకున్నారు. సుపరిపాలన అందించేందుకు సురీందర్ చౌదరిని ఎన్నుకున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. సురీందర్ కుమార్ చౌదరి (56) నౌషెరా నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అలా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2022లో పీడీపీని వీడి బీజేపీలో చేరారు. గతేడాది ఎన్‌సీలో చేరారు. 12వ తరగతి వరకు చదువుకున్నారు.

ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయబడిన తర్వాత.. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత 2019 నుంచి ఎన్నికైన మొదటి ప్రభుత్వం ఇదే. 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాల్లో గెలుపొందగా.. కూటమి భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ ఆరింటిని కైవసం చేసుకుంది. ఐదుగురు సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేశారు.

ఇది కూడా చదవండి: Actor Baiju: తాగి ఆక్సిడెంట్ చేసిన నటుడు.. ఆ వీడియో షేర్ చేస్తూ క్షమాపణలు