NTV Telugu Site icon

Shweta K Sugathan: రిపబ్లిక్ డే రోజున “మహిళా పోలీస్ మార్చ్‌”కి స్వేత కే సుగతన్ నాయకత్వం.. ఈమె ఎవరో తెలుసా..?

Shweta K Sugathan

Shweta K Sugathan

Shweta K Sugathan: భారతదేశ గణతంత్ర వేడుకుల పరేడ్ చరిత్రంలోనే తొలిసారిగా ఢిల్లీ పోలీస్ బృందంలో మొత్తం మహిళా అధికారులు ఉండబోతున్నారు. నార్త్ డిస్ట్రిక్ట్, పోలీస్-II అడిషనల్ డిప్యూటీ కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి శ్వేతా కే సుగతన్ ఈ పరేడ్‌ని నాయకత్వం వహించనున్నారు.  75వ రిపబ్లిక్ డే పరేడ్‌కి ఓ మహిళా అధికారి ఇలా నేతృత్వం వహించనున్నారు.

ఢిల్లీ పోలీస్‌కి చెందిన 194 మంది మహిళా అధికారులు కర్తవ్య మార్గ్‌లో కవాతు చేయనున్నారు. నివేదిక ప్రకారం.. ఈ రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటున్న వారిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల అసమానతలను తొలగించేందుకు ఢిల్లీ పోలీసులు 8 ఈశాన్య రాష్ట్రాల నుంచి పోలీసులను రిక్రూట్ చేసుకునే విధానాన్ని కలిగి ఉన్నారు.

Read Also: Amarnath: నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదు
కిరణ్ బేడీ తర్వాత శ్వేత కే సుగతన్:

గతేడాది శ్వేతా కే సుగతన్ రిపబ్లిక్ డే కంటెంజెంట్‌లో కూడా ఢిల్లీ పోలీసు బృందానికి (పురుష మరియు మహిళా అధికారులతో కూడిన) నాయకత్వం వహించారు. 48 ఏళ్ల చరిత్రలో ఇలా నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఈమె నిలిచారు. కిరణ్ బేడీ తర్వాత ఢిల్లీ పోలీస్ దళానికి నేతృత్వం వహించిన మహిళా కమాండర్‌గా నిలిచారు.

ఢిల్లీ పోలీసులు 1955లో మొదటిసారిగా రాజ్‌పథ్(కర్తవ్య మార్గ్)లో కవాతు చేశారు. 1975లో కిరణ్ బేడీ నాయకత్వం వహించి తొలి మహిళగా నిలిచారు. దాదాపు 5 దశాబ్ధాల తర్వాత శ్వేతా కే సుగతన్ వచ్చారు. 955 నుండి, ఢిల్లీ పోలీసులు 26 జనవరి పరేడ్‌లో 40 సార్లు బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డును అందుకున్నారు.

ఎవరీ శ్వేతా కే సుగతన్.?

శ్వేతా కె సుగతన్ గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసు అదనపు డిసిపి-II ఉత్తర జిల్లాగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆమె చాణక్యపురిలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. శ్వేత సొంత రాష్ట్రం కేరళ. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ యొక్క 2019 AGMUT కేడర్‌కు చెందినవారు. సుగతన్ 2015లో డిగ్రీ పట్టా పొందారు. 2019లో యూపీఎస్సీ పరీక్షని క్లీయర్ చేసి ఐపీఎస్ అయ్యారు. తొలుత చాణక్య పురిలో ఏసీపీగా నియమితులయ్యారు.