రివాబా జడేజా.. నిన్నామొన్నటిదాకా అంతగా ఫేమస్ కానీ ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యగా ముఖ పరిచయం కానీ.. పేరు అంతగా గుర్తింపు పొందలేదు. కానీ తాజాగా ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికంతటికి ఆమెకు ప్రమోషన్ దక్కడమే కారణం. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదిగిపోయారు. శుక్రవారం జరిగిన గుజరాత్ కేబినెట్ విస్తరణలో అనూహ్యంగా రివాబా జడేజాకు చోటు దక్కింది. మంత్రివర్గ విస్తరణ ఒకెత్తు అయితే.. రివాబా జడేజా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం హైలెట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు సంబంధించిన విషయాలను నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు. అసలామె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదివేయండి.
రివాబా జడేజా.. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య. నవంబర్ 2, 1990న రాజ్‌కోట్‌లో హర్దేవ్‌సిన్హ్, ప్రఫుల్లబా సోలంకి దంపతులకు జన్మించారు. రాజ వంశానికి చెందిన రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన వారు. అంతేకాదు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు హరి సింగ్ సోలంకికి బంధువు కూడా. అహ్మదాబాద్‌లోని గుజరాత్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అనంతరం మహిళా సంక్షేమం, సాధికారతపై దృష్టి సారించే శ్రీ మాతృశక్తి ఛారిటబుల్ ట్రస్ట్ అనే ఎన్జీవోను స్థాపించారు. 2016లో క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేడు ఎంత తగ్గిందంటే..!
2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీతో రాజకీయ అరంగ్రేటం చేశారు. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో జడేజాతో పాటు భారీ ఎత్తున ప్రజల మద్దతు లభించింది. ఇక రాజకీయాల్లోకి రాక ముందు రాజ్‌పుత్ సంస్థ కర్ణి సేనతో సంబంధం కలిగి ఉన్నారు.
ఇది కూడా చదవండి: Trump: త్వరలో రష్యా చమురు కొనుగోలు భారత్ నిలిపివేస్తుంది.. మరోసారి ట్రంప్ కీలక ప్రకటన
2027లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పార్టీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ఇందులో భాగంగా రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది. ఇలా ఆమె ట్రెండింగ్‌లోకి వచ్చారు.
#WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0
— ANI (@ANI) October 17, 2025
